IIT Guwahati Student: వైఎస్సార్ కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం అసోం వెళ్లిన తెలుగు విద్యార్థిని బ్రహ్మపుత్ర నదిలో పడి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది.
కడప జిల్లా పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లి గ్రామానికి చెందిన చేతన (20) గువాహటి ఐఐటీ (IIT Guwahati)లో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శనివారం స్నేహితులతో కలిసి విహారయాత్రలో భాగంగా బ్రహ్మపుత్ర నదిని చూసేందుకు వెళ్లి ఈ ఘోర ప్రమాదానికి గురైంది.
Read Also:Sangareddy Road Accident: 161 జాతీయ రహదారిపై దారుణ ప్రమాదం
ప్రమాదం జరిగిందిలా

నది అందాలను తిలకిస్తున్న సమయంలో చేతన ప్రమాదవశాత్తు కాలుజారి బ్రహ్మపుత్ర నదిలో పడిపోయింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో క్షణాల్లోనే కొట్టుకుపోయింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సహాయక బృందాలు గాలించి ఆమె మృతదేహాన్ని వెలికితీశాయి.
IIT Guwahati Student: ఒక్కగానొక్క కుమార్తె మృతితో మిన్నంటిన రోదనలు
మృతురాలు చేతన జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్‌రెడ్డి ఏకైక కుమార్తె. ఉన్నతంగా ఎదుగుతుందనుకున్న కంటిపాప అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు గుండెలు విలపించేలా రోదిస్తున్నారు. అసోం పోలీసులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గువాహటి బయలుదేరి వెళ్లారు. చేతన మృతి వార్తతో ఎన్.కొట్టాలపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
Epaper: epaper.vaartha.com

