Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎఫ్‌డీ ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ ఇవే!

ఎఫ్‌డీ ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ ఇవే!

వార్త 5 days ago

RBI new FD rules: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (FD) డబ్బులు దాచుకునే సామాన్య ఇన్వెస్టర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

బ్యాంకుల్లో డిపాజిట్ చేసే నిధులపై వడ్డీ రేట్లను మరింత పారదర్శకంగా మార్చడంతో పాటు, పెద్ద మొత్తంలో చేసే బల్క్ డిపాజిట్ల ప్రైసింగ్‌లో బ్యాంకులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు సరికొత్త డ్రాఫ్ట్ రూల్స్‌ను ప్రతిపాదించింది.

Read also: Infosys Company : ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ భారీ షాక్: నకిలీ గుర్తింపులపై కొరడా

 Fantastic news from the RBI for FD investors-here are the new rules!

RBI new FD rules: ఉదయమే వడ్డీ రేట్లు వెల్లడించాలి!

ఆర్బీఐ ప్రతిపాదించిన కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై ప్రతి బ్యాంక్ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల వివరాలను, ఆ రోజు బ్యాంక్ బిజినెస్ ప్రారంభం కావడానికి ముందే తమ అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలి. ఆ రోజు కస్టమర్లకు ఇచ్చే వడ్డీ రేట్లు పూర్తిగా వెబ్‌సైట్‌లో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఉండాలి. దీనివల్ల సామాన్య కస్టమర్లకు ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తోంది, ఎక్కడ తక్కువ వస్తోంది అనేది ఈజీగా పోల్చి చూసుకునే అవకాశం లభిస్తుంది.

బల్క్ డిపాజిట్లకు బంపర్ ఆఫర్!

ఈ కొత్త నిబంధనలు ప్రధానంగా బల్క్ డిపాజిట్లకు వర్తిస్తాయి. బ్యాంకులు తమకు ఉన్న లిక్విడిటీ అవసరాలను బట్టి ఈ బల్క్ డిపాజిట్లపై రకరకాల వడ్డీ రేట్లను ఆఫర్ చేయవచ్చు. ఉదాహరణకు, ఏదైనా బ్యాంకుకు అత్యవసరంగా నిధులు కావాల్సి వస్తే.. పెద్ద మొత్తంలో డబ్బు దాచే ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి భారీగా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్యాంకుల మధ్య పోటీ పెరిగి, కాలక్రమేణా సామాన్య రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా లాభం చేకూరుతుంది.

ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం.. ఇకపై ఎఫ్‌డీలు అనేవి కేవలం డబ్బులు వేసి మర్చిపోయే ప్రొడక్ట్ కాదు, వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ పాత ఎఫ్‌డీలు రిన్యూవల్ అయ్యేటప్పుడు లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు.. కేవలం వడ్డీ రేట్లే కాకుండా, మెచ్యూరిటీ కంటే ముందే డబ్బులు తీస్తే పడే పెనాల్టీలు, స్వీప్-ఇన్ ఫెసిలిటీస్ వంటి అంశాలను కూడా బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.

ప్రస్తుతం మార్కెట్లో వివిధ బ్యాంకుల FD వడ్డీ రేట్లు

ప్రస్తుతం మన దేశంలోని వివిధ బ్యాంకుల్లో కాలపరిమితిని బట్టి ఏడాదికి 2.50% నుండి 8.10% వరకు వడ్డీ లభిస్తోంది. ఆయా బ్యాంకుల వివరాలు క్రింది పట్టికలో చూడవచ్చు:

బ్యాంకుల విభాగంబ్యాంకుల పేర్లులభిస్తున్న వడ్డీ రేట్లు (సుమారుగా)
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుసూర్యోదయ్, ఉత్కర్ష్, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్7.77% నుండి 8.10% వరకు
మిడ్-లెవెల్ ప్రైవేట్ బ్యాంకులుఐడీఎఫ్‌సీ ఫస్ట్, బంధన్, డిసిబి, యెస్ బ్యాంక్, ఆర్‌బీఎల్7.00% కంటే ఎక్కువ
ప్రముఖ ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులుఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్6.45% నుండి 6.80% మధ్య

ఆర్బీఐ తీసుకువస్తున్న ఈ కొత్త మార్పుల వల్ల బ్యాంకుల మధ్య డిపాజిట్ల కోసం పోటీ పెరిగి, రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్లకు మరిన్ని మంచి ఆఫర్లు, ఎక్కువ వడ్డీలు లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

సగం తిన్న యాపిల్స్ జనాల్లోకి విసిరిన సీఎం డీకే శివకుమార్ పై తీవ్ర విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha