Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏజెన్సీలో డ్రోన్ కలకలం: అసలేం జరిగింది?

ఏజెన్సీలో డ్రోన్ కలకలం: అసలేం జరిగింది?

వార్త 3 months ago

Alluri district drone Crash: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో జరిగిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆకాశం నుంచి భారీ శబ్దంతో ఒక వింత వస్తువు అడవిలో పడిపోవడంతో గిరిజనులు భయాందోళనలకు గురయ్యారు.

అయితే, అది ప్రభుత్వ వైద్య సేవల కోసం వినియోగిస్తున్న అత్యాధునిక డ్రోన్ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also:Delhi Govt: శిశువులకు ఇక ఉచితంగా జన్యు పరీక్ష

Alluri district drone Crash: ఘటన నేపథ్యం

ప్రభుత్వం 'రెడ్ వింగ్' అనే సంస్థ సహకారంతో ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు అత్యవసర మందులు చేరవేసేందుకు డ్రోన్ సేవలను పరీక్షిస్తోంది. ఈ ట్రయల్ రన్‌లో భాగంగా వెళ్లిన డ్రోన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో దట్టమైన చెట్లపై కూలిపోయింది. ఈ డ్రోన్ సాధారణ డ్రోన్‌ల కంటే చాలా పెద్దదిగా, మినీ హెలికాప్టర్ ఆకారంలో ఉండటంతో గిరిజనులు మొదట అయోమయానికి గురయ్యారు.

https://www.instagram.com/reel/DWYKmmkimTI

ఈ వింత వస్తువు కూలిపోయిందన్న వార్త తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రోన్ జనసంచారంలేని ప్రాంతంలో పడటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, అది తమ ఇళ్లపై పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న కంపెనీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ట్రయల్ రన్స్‌లో ఇది సహజమేనని వారు వివరించారు. అత్యాధునిక టెక్నాలజీ వాడటం మంచిదే అయినా, భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కేంద్రం పన్ను తగ్గించాక మీ స్థలాల్లో రేట్లు తగ్గాయా చెక్ చేస్కోండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha