Delhi Govt: నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో ఢిల్లీ ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. శిశువుల్లో పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాలను ముందుగానే గుర్తించే లక్ష్యంతో 'అన్మోల్' అనే పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జన్మించే పిల్లలందరికీ ఉచితంగా జెనెటిక్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Read Also : Hardeep Singh Puri tweet: దేశంలో లాక్‌డౌన్ వార్తలు.. కేంద్ర మంత్రి స్పష్టత
Delhi Government’s ‘Anmol’ scheme for babies.
Delhi Govt: 56 రకాల ప్రమాదకర వ్యాధుల గుర్తింపు
చాలా సందర్భాల్లో శిశువుల్లో జన్యు, జీవక్రియ సంబంధిత వ్యాధుల లక్షణాలు పుట్టిన వెంటనే బయటపడవు. అయితే, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఇవి మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపడం లేదా శాశ్వత అంగవైకల్యానికి దారితీయవచ్చు. ‘అన్మోల్’ పథకం ద్వారా కంజెనిటల్ హైపోథైరాయిడిజం, సికిల్ సెల్ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సుమారు 56 రకాల ప్రమాదకరమైన వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.
ఈ పరీక్ష కోసం శిశువు జన్మించిన 24 నుంచి 72 గంటల లోపు, మడమ నుంచి కేవలం కొన్ని రక్తపు చుక్కలను సేకరిస్తారు. ఇది అత్యంత సురక్షితమైన పద్ధతి. సాధారణంగా బయట ప్రైవేట్ ల్యాబ్‌లలో ఈ జెనెటిక్ స్క్రీనింగ్‌కు రూ. 7,000 నుంచి రూ. 15,000 వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ సేవలను ఉచితంగా అందించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఆర్థిక ఊరట లభించనుంది.
ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసా
వ్యాధి లక్షణాలు బయటపడకముందే గుర్తించి, తగిన చికిత్స, ఆహార నియమాలు పాటిస్తే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కేరళ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్న రెండో ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది. ఈ పథకం ద్వారా భావి భారత పౌరుల ఆరోగ్యానికి గట్టి భరోసా లభించనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

