Purvanchal Expressway Accident: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై టెన్నిస్ క్రీడాకారులతో వెళ్తున్న కారు ఒక ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ధన్‌పట్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖ్‌బదేరి సమీపంలో ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు టెన్నిస్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also : Virat Kohli : కోహ్లి రూ.5 కోట్లు తీసుకున్నాడనే ప్రచారం అసలు క్లారిటీ ఇదే !!
Four young cricketers killed in a road accident!
Purvanchal Expressway Accident: అతివేగమే ప్రమాదానికి కారణం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం ఆరుగురు టెన్నిస్ క్రీడాకారులు లక్నోలో జరిగిన ఒక క్రీడా పోటీలో పాల్గొని తిరిగి దేవరియాకు బయలుదేరారు. ప్రయాణ సమయంలో కారు గంటకు సుమారు 100 కిలోమీటర్ల అతివేగంతో వెళ్తూ, ముందు వెళ్తున్న ట్రక్కును తీవ్రస్థాయిలో ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎక్కువ మంది నిద్రపోతున్నారని, ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో మేల్కొన్నామని గాయపడిన వారిలో ఒకరైన జయంతో శర్మ తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.
సహాయక చర్యలు, బాధితుల వివరాలు
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికుల సహాయంతో కారు తలుపులు పగులగొట్టి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అనంతరం ఆరుగురినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతులను దేవరియాకు చెందిన నిత్య ప్రజాపతి (22), ఇర్ఫాన్ అన్సారీ (20) మరియు బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన అనికేత్ (24)గా గుర్తించారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆనంద్ యాదవ్ (23), రాజు (22) మరియు పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌కు చెందిన జయంతో శర్మ (30)లను మెరుగైన వైద్య సహాయం కోసం అయోధ్య మెడికల్ కాలేజీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
అజిత్ అగార్కర్‌పై గంభీర్ ప్రశంసలు.. చరిత్ర గుర్తుంచుకుంటుంది!

