Festive season : ఈసారి పండగ సీజన్ ప్రారంభానికి ముందే వినియోగదారులకు షాక్ తగులబోతున్నది. ఏసీలు, మొబైల్ ఫోన్‌లు , ఎల్ఈడీ టీవీలు , వాషింగ్ మెషీన్‌లు , రిఫ్రిజిరేటర్ల వంటి ఎలక్ట్రానిక్స్ ధరలు అక్టోబర్ 1 నుంచి పెరుగబోతున్నాయి.
ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 5 నుంచి 8 శాతం వరకు పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాదిలో ఇలా ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనించవలసిన విషయం. అల్యూమినియం, రాగి, ఉక్కు వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కరెన్సీ మారకం విలువలో వస్తున్న హెచ్చుతగ్గులు ఈ పెంపునకు ప్రధాన కారణాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏసీల ధరలు 5 నుంచి 8 శాతం మేర పెరగనుండగా.. టీవీలు, వాషింగ్ మెషిన్ల ధరలు 3-4 శాతం వరకు పెరగనున్నాయి. బ్లూస్టార్, గోద్రెజ్, హయర్, దైకిన్ వంటి సంస్థలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించాయి.

Festive season
Festive season : దీపావళి తర్వాత కొత్త ధరలు
ఎల్జీ, వోల్టాస్, హిటాచి బ్రాండ్ ఏసీలను విక్రయించే బాష్ హోమ్ కంఫర్ట్ కూడా సుమారు 5 శాతం ధరలను పెంచినట్లు తెలుస్తున్నది. ముడిసరుకుల ధరల పెరుగుదలవల్లే ధరలు పెంచక తప్పడం లేదని బ్లూస్టార్ ఎండీ బి త్యాగరాజన్ అన్నారు. రాగి ధర గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిందని, అందుకే ఏసీల ధరలను 5 శాతం పెంచుతున్నామని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ చెప్పారు. అయితే డీలర్ల దగ్గర పాత స్టాక్ ఒకటి, ఒకటిన్నర నెలలపాటు అందుబాటులో ఉండే అవకాశం ఉందని, కాబట్టి దీపావళి వరకు వినియోగదారులకు పాత ధరలకే ఉత్పత్తులు లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీపావళి తర్వాత కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ విధించడాన్ని ఆపలేమన్న సుప్రీం కోర్టు

