Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్లుండి వైన్ షాపులు బంద్

ఎల్లుండి వైన్ షాపులు బంద్

వార్త 2 weeks ago

Wine Shops Closed: హైదరాబాద్ మహా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ మరియు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 9వ తేదీన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు కీలక ప్రాంతాల్లో మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని (Liquor Ban) ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 9న ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు అన్ని రకాల వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్లు మరియు రెస్టారెంట్లను మూసి ఉంచాల్సి ఉంటుంది.

Read Also :The welfare of handloom weavers : చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రులు తుమ్మల, సీతక్క

Wine Shops Closed: ఆంక్షలు అమలులో ఉండే పోలీస్ స్టేషన్ల పరిధులు:

కమిషనరేట్ పరిధిలోని క్రింది ప్రధాన పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి:

  1. కూకట్‌పల్లి (Kukatpally)
  2. అల్లాపూర్ (Allapur)
  3. రాయదుర్గం (Raidurgam)
  4. జీడిమెట్ల (Jeedimetla)
  5. మేడ్చల్ (Medchal)
  6. చందానగర్ (Chandanagar)

ఉత్తర్వులను ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపినా లేదా అక్రమంగా బార్లు తెరిచినా కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ శాఖ హెచ్చరించింది.

చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రులు తుమ్మల, సీతక్క

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha