Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్‌నినో ముప్పు.. సామాన్యుడిపై ధరల భారం తప్పదా?

ఎల్‌నినో ముప్పు.. సామాన్యుడిపై ధరల భారం తప్పదా?

వార్త 4 days ago

El Nino Effect: పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తున్న భౌగోళిక మార్పుల కారణంగా ఏర్పడుతున్న ఎల్‌నినో (El Nino) ప్రభావంతో భారత రుతుపవనాలు (మాన్సూన్) బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీని ప్రభావం దేశవ్యాప్తంగా వర్షపాతంపై పడితే, అది నేరుగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షపాతం తగ్గితే దేశంలో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముంది. ఫలితంగా మార్కెట్లో నిత్యం వాడే పాలు, నెయ్యి పెరుగు, పనీర్ ధరలు భారీగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు

Read Also : Ketan Agarwal case: పుణే మర్డర్ కేసు.. సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా

 El Niño threat… Is a price burden on the common man inevitable?

El Nino Effect: నిత్యావసరాలు, కూరగాయల ధరలకూ రెక్కలు!

కేవలం డైరీ ఉత్పత్తులే కాకుండా, సాగునీటి కొరత కారణంగా వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో వంటింట్లో అత్యవసరమైన పప్పులు, పండించే కూరగాయలు, వంటనూనెల ధరలు కూడా సాధారణ స్థాయి కంటే పెరిగి సామాన్యుడి బడ్జెట్‌ను దెబ్బతీసేలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ఏర్పడిన ప్రతి సంవత్సరంలోనూ నిత్యావసరాల ధరలు పెరగడం అనేది ఖచ్చితమైన నియమం ఏమీ కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కురిసే వాస్తవ వర్షపాతం, దేశంలోని జలాశయాలలో నీటి నిల్వలు, అందుబాటులో ఉండే సాగునీటి సౌకర్యాలతో పాటు.. సకాలంలో ప్రభుత్వం తీసుకునే ముందస్తు రక్షణ చర్యలపైనే ఆయా పరిస్థితులు ఆధారపడి ఉంటాయని విశ్లేషిస్తున్నారు.

భారత సైన్యానికి కొత్త బాస్: 31వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha