El Nino : తరతరాలుగా, భారత వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి కొనసాగుతున్నది. వర్షాలు సకాలంలో కురిసి, రుతుపవనాలు సమానంగా విస్తరించినపుడు మాత్రమే పంటలు బాగా పండుతాయి.
పర్యావరణ భూగోళంపై ఈ ఏడాది అతి బలమైన ఎల్నినో ఏర్పడవచ్చనే చేదు విషయాన్ని నివేదిక బహిర్గతం చేసింది. పసిఫిక్ మహా సముద్రంలో జలాలు సాధారణం కన్నా అధికంగా వేడెక్కడాన్ని ‘ఎల్నినో’ అని అంటారు. సాధారణం కన్న 2.5 డిగ్రీల ఎక్కువగా సముద్ర నీటి ఉష్ణోగ్రతలు పెరగడాన్ని సూపర్ ఎల్నినో అని పిలుస్తున్నారు. ఎల్ నినో వల్ల జూన్ 2026 నుంచి వాతావరణ ప్రతికూల మార్పులు జరగవచ్చని, ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి అసా ధారణ రుతుపవనాల గమనం జరుగుతుందని నివేదిక రూపంలో స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో గాలుల దిశ మారిపోయి ప్రతికూల వాతావరణ మార్పులకు ఆజ్యం పోయవచ్చని అంచనా వేశారు. మే మాసంలో ఏర్పడే ఎల్ నినో ఆగష్టు నాటికి బలపడి సూపర్ ఎల్నినో ఏర్పడే అవ కాశం ఉందని తెలుస్తున్నది.
Read Also : Delhi Weather Update: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
El Nino
El Nino : అధిక ఉష్ణోగ్రతలు
ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో ప్రతికూల మార్పులు, సముద్ర తుఫాన్లు, కరవు కాటకాలు లాంటి దుష్ప్రభావాలు జరుగు తాయని గమనించాలి. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావం, సకాలంలో వర్షాలు పడకపోవడం, సుదీర్ఘ పొడిగాలులు వీయడం, వరి, పత్తి, వేరుశనగ లాంటి వర్షాధార పంటల దిగుబడులు భారీగా పడిపోవడం, తెగుళ్ల బెడద (రసం పీల్చే పేనుబంక, తెల్లదోమ, బూడిద తెగులు) పెరగడం, నీటి కొరత చల్ల చెరువులు, బావులు, చిత్తడి నేలలు ఎండి పోవడం లాంటి దుష్ప్రభావాలు జరిగే అవకాశం ఉండవ చ్చని అంచనా వేస్తున్నారు. ఎల్నినో ప్రభావానికి తట్టుకునే విధంగా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ నీటి తో పండే గోరుచుక్కుడు, మినుములు, కందులు, చిరు ధాన్యాలు లాంటి పంటలను ఎంచుకోవాలి. నేలలో తేమ ను సంరక్షించుకోవడానికి ఆకులతో కప్పడం(మల్చింగ్) లాంటి విధానం పాటించాలి. నేల సారానికి అనుగుణంగా ఎరువులు, సేంద్రియ పదార్థాలు వాడడం మంచిది. సస్య రక్షణలో భాగంగా తెగుళ్ల నివారణకు వ్యవసాయ అధికా రుల సూచనలతో సకాలంలో పురుగుమందులు పిచికారీ చేయాలి. సూక్ష్మసేద్యం ద్వారా ఉద్యాన రైతులకు కొంత మేర ఉపశమనం లభించవచ్చు. ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం, యుద్ధాలతో యూరియా లాంటి ఎరు వుల కొరత ఏర్పడనుందని గమనించాలి.
El Nino
పుండు మీద కారం చల్లినట్లు
రానున్నరోజుల్లో ఎల్నినో ప్రభావం పట్ల అవగామన పెంచుకొని రైతులు తగు పంటలపై దృష్టిని కేంద్రీకరించాలి. పంటల అవశేషా లను కాల్చడంతో భూసారం దెబ్బతినడం, దిగుబడులు తగ్గడం, ఎరువులు వేసినా తగిన ప్రయోజనం లభించక పోవడం లాంటి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని తెలు సుకోవాలి. ఇప్పటికే సూరన్న సుర్రుమంటున్నాడు. అకాల వర్షాలు అన్నదాత రోదనలకు ఆజ్యం పోస్తున్నాయి. చేతికి వచ్చిన పంట నేలపై వాలిపోయింది. పండ్లతోటల్లో కాయ లు రాలుతున్నాయి. ఆరుగాలం కష్టపడిన రైతన్న కంట కన్నీటి వరదలు పారుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్ష వడగళ్లతో హలధారి విలవిల్లాడుతున్నాడు. పుండు మీద కారం చల్లినట్లు రానున్న రోజుల్లో సూపర్ ఎలి నినో బలపడితే కరవు కరాళ నృత్యం చేయవచ్చు. ఆహార అభద్రత రాజ్యమేలవచ్చు. ఇలాంటి వాతావరణ ప్రతికూల మార్పులకు కారణాలను తెలుసుకొని, అరికట్టే ప్రయత్నాలు చేయనియెడల విశ్వమానవాళి సంక్షోభ సంకెళ్ల లో బంధించబడి హా హాకారాలతో ఆఖరి శ్వాస తీసుకోవచ్చు. ఈ పరిస్థితులను ఆలకించరు చేసుకొని రాబోయే కరవుల ను ఎదుర్కొనే చర్యలను నేటి నుండే మొదలు పెడదాం, రేపటి ఆరోగ్యకర వాతావరణానికి నేటి నుంచే హారతి పడదాం.
-డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

