Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్‌నినోతో రైతులు అప్రమత్తం కావాలి

ఎల్‌నినోతో రైతులు అప్రమత్తం కావాలి

వార్త 1 week ago

El Nino Effect; ఎల్‌నినో (El Niño) వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తమై ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ సూచించింది.

మెదక్ జిల్లా టేక్మాల్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ తులసీరామ్ పిలుపునిచ్చారు.ఈ నెల 27 నుండి 29 వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ విత్తన మేళాలో ఆరుతడి పంటలకు సంబంధించిన నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాలను అందుబాటులో ఉంచారు.

శాస్త్రీయ పద్ధతులు - వ్యవసాయ నిపుణుల సలహాలు

తక్కువ నీటి లభ్యతతో మెరుగైన దిగుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన మెలకువలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంటల ఎంపిక, విత్తన శుద్ధి విధానం, విత్తే సమయం, ఎరువుల యాజమాన్యం మరియు నేలలో తేమను సంరక్షించే శాస్త్రీయ పద్ధతులపై రైతులకు తగు సలహాలు అందిస్తున్నారు.

El Nino Effect: సిఫార్సు చేస్తున్న ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు

  • పప్పుధాన్యాలు: పెసర, మినుము, కంది.
  • చిరుధాన్యాలు: జొన్న, సజ్జ, రాగులు.
  • నూనెగింజలు & ఇతరాలు: నువ్వులు, ఆముదం.

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక సూచనలు పాటించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ సర్పంచ్ సుధాకర్, మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, నాయకులు పాపయ్య, మజార్, ఆర్‌ఐ నర్సింలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

జూరాలకు 27,200 క్యూసెక్కుల వరద

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha