Vijayawada Couple suicide: ఏడేళ్ల క్రితం ప్రేమగా ఒక్కటైన జంట.. ఇద్దరు కుమారులతో ఆనందంగా జీవనం సాగిస్తోంది. బయటకు చూస్తే సంతోషంగా కనిపించిన ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కానీ, ఊహించని విషాదం చోటుచేసుకుంది.
భార్యాభర్తలిద్దరూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీనగర్‌లో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని రేపింది.
Read Also : Nunna Suresh Death: రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల అధినేత నున్నా సురేశ్ దుర్మరణం!
Couple commits suicide by consuming pesticide.
Vijayawada Couple suicide: పిల్లలను బంధువుల ఇంట్లో దింపి..
దేవీనగర్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి బాజీ సైదులు, జలసూత్రం మానసలకు 2019లో వివాహమైంది. వీరికి సంజయ్ , సంతోష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సైదులు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో అవుట్‌సోర్సింగ్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మానస ఇంట్లోనే ఉంటూ ‘టెట్’ (TET) పరీక్షకు సిద్ధమవుతోంది. ఆదివారం ఉదయం సైదులు తన ఇద్దరు పిల్లలను ఇందిరా నాయక్‌నగర్‌లోని సోదరుడి వద్ద దింపి పనులకు వెళ్లాడు. మానస ఉదయం చర్చికి వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఇంటికి వచ్చింది.
‘విషం తాగాం.. ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ ఫోన్
సాయంత్రం 5 గంటల సమయంలో సైదులు తన మావయ్య వీరభద్రరావుకు ఫోన్ చేసి, తాము దంపతులిద్దరం విషం తాగామని, వెంటనే వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. కంగారుపడిన ఆయన వెంటనే ఇతర బంధువులకు సమాచారం అందించి హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే దంపతులిద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు.
సైదులు, మానస ఎంతో అన్యోన్యంగా ఉంటారని, వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవని బంధువులు చెబుతున్నారు. దంపతుల మధ్య ఏదైనా చిన్నపాటి విభేదాలు వచ్చి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆన్‌లైన్‌లో గడ్డి మందు, కూల్‌డ్రింక్ ఆర్డర్ చేసి, ఆ డ్రింక్‌లో విషం కలుపుకుని తాగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అజిత్‌సింగ్‌నగర్ సీఐ తెలిపారు
యాత్రికుల వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం, 13 మందికి తీవ్ర గాయాలు

