Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాత్రికుల వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం, 13 మందికి తీవ్ర గాయాలు

యాత్రికుల వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం, 13 మందికి తీవ్ర గాయాలు

వార్త 1 week ago

Vizianagaram Road Accident: విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు, వారి బంధువులు కలిసి దైవ దర్శనానికి బయలుదేరారు.

ఒడిశా రాష్ట్రం రాయగడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మజ్జి గౌరమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఐదుగురు మహిళలతో సహా మొత్తం 16 మంది ప్రయాణికులు ఒక బొలెరో వాహనాన్ని సమకూర్చుకుని ప్రయాణమయ్యారు. అయితే, వారు అనుకున్న గమ్యస్థానానికి చేరుకోకముందే అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది.

వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం విజయనగరం జిల్లా చెల్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక లారీ, ఆగి ఉన్న బొలెరోను బలంగా ఢీకొట్టింది. లారీ తీవ్రమైన వేగంతో ఉండటంతో ప్రమాద తీవ్రత అధికమై బొలెరో వాహనం దారుణంగా నుజ్జునుజ్జయింది.

Read Also : Chittoor Road Accident: నీళ్లు పట్టుకుంటుండగా దూసుకొచ్చిన టెంపో.. ముగ్గురు దుర్మరణం!

 Lorry rams into pilgrims’ van; three killed, 13 critically injured.

Vizianagaram Road Accident: అక్కడికక్కడే ముగ్గురి ప్రాణాలు అనంత వాయువుల్లో..

ఈ ఘోర ప్రమాదంలో బొచ్చపేట గ్రామానికి చెందిన రాంబాబు (50), నారాయణరావు (50) లతో పాటు మోహన్‌ నాయుడు (8) అనే ఎనిమిదేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉన్న రాంబాబు, నారాయణరావు ఇద్దరూ పెయింటింగ్ పనులు చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. వారిద్దరి అకాల మరణంతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి తీరని శోకసంద్రంలో మునిగిపోయాయి.

బాధితులకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న విజయనగరం రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 13 మందిని 108 అంబులెన్సుల ద్వారా విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల అధినేత నున్నా సురేశ్‌ దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha