Dailyhunt
ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

వార్త 2 weeks ago

MLC Anantha Babu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి చిక్కుల్లో పడ్డారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి ఆరోపణలపై సర్పవరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

రాజమహేంద్రవరం కోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అరెస్ట్ అనంతరం అనంతబాబును సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు శనివారం ఉదయం వరకు సుదీర్ఘంగా విచారించారు. సాక్షులను ఎవరు ప్రలోభపెట్టారు? కేసు నమోదైన మూడు రోజుల పాటు ఎక్కడికి వెళ్లారు? అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని చెబుతూనే, సాక్షులను బెదిరించిన విషయం తనకు తెలియదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం.

Read Also : Srisailam: మల్లన్న సేవలో ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్

 MLC Ananthababu remanded for 14 days.

MLC Anantha Babu: కోర్టు రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

పోలీసుల విచారణ అనంతరం అనంతబాబుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను కాకినాడ మొబైల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆయనను భారీ భద్రత నడుమ రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై కూడా ఆరోపణలు ఉండటం గమనార్హం.

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు గతంలోనే జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ ఏప్రిల్ 20న సర్పవరం స్టేషన్‌లో కొత్తగా కేసు నమోదైంది. నిబంధనల ఉల్లంఘన కారణంగానే పోలీసులు వేగంగా స్పందించి ఈ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ లీసా గిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha