Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన జిల్లా కోర్టు!

ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన జిల్లా కోర్టు!

వార్త 3 months ago

Driver Subramanyam Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇప్పటికే కొందరు సాక్షులను బెదిరించారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ వాదనలతో ఏకీభవించిన జిల్లా కోర్టు, ఆయనకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఆయన రిమాండ్ కంటిన్యూ కానుంది.

Read Also:Jangaon Crime: మహిళతో సహజీవనం: పెట్రోల్ పోసుకుని యువకుడి బలవన్మరణం

విచారణ షెడ్యూల్ విడుదల

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న అనంతబాబుకు సంబంధించి, ఈ కేసులో సాక్షుల విచారణ ఏ విధంగా జరగాలనే దానిపై రాజమండ్రి జిల్లా కోర్టు స్పష్టమైన షెడ్యూల్‌ను వెల్లడించింది. విచారణను వేగవంతం చేసి సాక్ష్యాధారాలను సేకరించాలని కోర్టు భావిస్తోంది.

Driver Subramanyam Murder Case: సుప్రీంకోర్టు డెడ్ లైన్

2022 మే నెలలో కాకినాడలో జరిగిన ఈ హత్య కేసుపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సీరియస్‌గా ఉంది. కేసు విచారణలో జాప్యం జరగకూడదని, ఈ ఏడాది నవంబర్ లోపు తుది తీర్పు వెలువరించాలని కింది కోర్టును సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కేసు నేపథ్యం:

తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనేది ప్రధాన ఆరోపణ. బాధితుడి మృతదేహాన్ని తన స్వంత కారులోనే ఇంటికి తీసుకురావడం అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలకు, రాజకీయ దుమారానికి దారితీసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్‌ దేశం దాటకూడదు: పోలీసులకు కవిత విజ్ఞప్తి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha