Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళతో సహజీవనం: పెట్రోల్ పోసుకుని యువకుడి బలవన్మరణం

మహిళతో సహజీవనం: పెట్రోల్ పోసుకుని యువకుడి బలవన్మరణం

వార్త 1 week ago

Jangaon Crime: సహజీవనం నేపథ్యంలో తలెత్తిన వ్యక్తిగత మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..

అఖిల్ అనే యువకుడు ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలిసింది.

Read Also: Chhattisgarh: పుచ్చకాయ తిని బాలుడు మృతి? నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం!

 Cohabitation with woman: Young man commits suicide after dousing himself with petrol

Jangaon Crime: పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అఖిల్ మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అఖిల్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత విభేదాల కోణంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సనత్ నగర్ బాలుడి హత్య కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha