Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంపీడీఓ కార్యాలయంలో విజిలెన్స్ మెరుపు దాడులు

ఎంపీడీఓ కార్యాలయంలో విజిలెన్స్ మెరుపు దాడులు

వార్త 2 months ago

Ibrahimpatnam MPDO Office: ఎంపీడీఓ కార్యాలయంలో..విజిలెన్స్‌ మెరుపు దాడులు.మరోవైపు దాడులతో అయోమయంలో సిబ్బంది. ఉలిక్కిపడ్డ ఇబ్రహీంపట్నం.. అధికారుల పరార్‌.

రికార్డులను జల్లెడ పడుతున్న బృందం; ఒకవైపు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.

Read Also:Vanasthalipuram Road Accident: మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి

ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయం బుధవారం విజిలెన్స్‌ అధికారుల రాకతో ఒక్కసారిగా దద్దరిల్లింది. రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖాగోయెల్‌ ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.ఉదయం కార్యాలయానికి చేరుకున్న బృందం తనిఖీలు చేపట్టింది. కంప్యూటర్లలోని డేటా, కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. పథకాల అమలు, నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నారు. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా సిబ్బంది హాజరు పట్టికను విశ్లేషిస్తున్నారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ ముగిసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తాం అని విజిలెన్స్ బృందం స్పష్టం చేసింది.

ఇటు కలెక్టర్ టూర్.. అటు విజిలెన్స్ దాడులు

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య హెల్త్ వీక్ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలిమినేడు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఓవైపు కలెక్టర్ కార్యక్రమం మరోవైపు విజిలెన్స్ సోదాలతో పంచాయతీ కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామాల్లో హెల్త్ ప్రోగ్రామ్‌లో ఉండాలా ? లేక విజిలెన్స్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ ఆఫీస్‌కు వెళ్లాలా? అని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఎంపీడీఓ శిక్షణ పేరుతో నగరానికి పరిమితం కాగా, అటు మండల పంచాయతీ అధికారి గ్రామాల్లో పర్యటనలో ఉన్నారు. మండల కార్యాలయంలో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఉండటం, కీలక సమయంలో విజిలెన్స్ దాడులు జరగడం ఇప్పుడు మండల వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ దాడులతో పక్కనే ఉన్న ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వణుకు మొదలైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ట్రైనీ పైలెట్‌పై ఇన్‌స్ట్రక్టర్ అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha