Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంపీపీ ఎస్ పాఠశాలలో మరుగుదొడ్ల ప్రారంభోత్సవం

ఎంపీపీ ఎస్ పాఠశాలలో మరుగుదొడ్ల ప్రారంభోత్సవం

వార్త 2 months ago

MPPS School Choutkur: సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో శనివారం నాడు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను స్థానిక సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్ల కొరత ఉందని ప్రధానోపాధ్యాయులు తెలియజేయడంతో వెంటనే స్పందించి రూ.4 లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన షూస్, బెల్టులు, పుస్తకాలను కూడా అందజేశామని పేర్కొన్నారు.

MPPS School Choutkur: విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దమ్మి నాగరాణి కృష్ణ, వార్డ్ సభ్యులు జైపాల్ రెడ్డి, చక్రపాణి, గోరేమియా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ బాబు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాటం.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గర్జన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha