Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎండదెబ్బకు పచ్చి మామిడికాయతో ఉపశమనం

ఎండదెబ్బకు పచ్చి మామిడికాయతో ఉపశమనం

వార్త 1 week ago

Green mango : ఎండకాలంలో లభించే అమృతం పచ్చి మామిడికాయ. కేవలం రుచి కోసమే కాదు, వేసవిలో వచ్చే ఎండదెబ్బ తీవ్రమైన అలసట నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

అసలు పచ్చి మామిడికాయలు తింటే గుండెకు ఎంత మంచిదో.. డయాబెటిస్ వాళ్లకు ఇది ఎలా హెల్ప్ అవుతుందో తెలిస్తే మీరు అస్సలు వదలరు. ఉగాది పచ్చడి నుండి నోరూరించే ఆవకాయ వరకు, ఘాటైన చట్నీల నుండి చల్లని ఆమ్ పన్నా వరకు పచ్చి మామిడికాయలను ప్రతి ఇంట్లో రకరకాలుగా వాడుతుంటారు. పచ్చి మామిడికాయ కేవలం నోటికి రుచిని అందించడమే కాదు.. ఎండ తీవ్రత నుండి మన శరీరాన్ని కాపాడే బోలెడన్ని పోషకాల గని అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఎ, సి, కె, బి6 లతో పాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో పచ్చి మామిడికాయను మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Read Also: Dinner : నైట్ లేట్ గా డిన్నర్ చేస్తున్నారా.. అయితే అలర్ట్ అవ్వాల్సిందే!

 Green mango

Green mango : దివ్యౌషధం

పచ్చి మామిడికాయలలో పీచుపదార్థం అత్యధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. వేసవిలో వేడి వల్ల వచ్చే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను నివారించడంలో పచ్చి మామిడికాయ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. పచ్చి మామిడిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్, ఐరన్, విటమిన్ ఇ వంటి పోషకాలు మీ జుట్టుకు, చర్మానికి అద్భుతమైన పోషణను అందిస్తాయి. ఇందులోని విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడతలు పడకుండా గ్లో తెస్తుంది. అలాగే ఐరన్, జింక్ జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. పచ్చి మామిడికాయలలో శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. అంతేకాకుండా వాటిలోని ఫైబర్, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా మొత్తం గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

 Green mango

ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత

పచ్చి మామిడికాయకు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఇందులో పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల, ఇది మధుమేహ రోగుల మెటబాలిజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఊరగాయల రూపంలో కాకుండా పచ్చి ముక్కలుగా లేదా పన్నా రూపంలో తీసుకోవడం మంచిది. ఎండల్లో తిరగడం వల్ల శరీరం లోని సోడియం క్లోరైడ్, స్వేదం రూపంలో బయటకు పోయి నీరసం వస్తుంది. పచ్చి మామిడికాయను కొద్దిగా ఉప్పు చల్లుకుని తినడం వల్ల లేదా దాని జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఇది వడదెబ్బ తగలకుండా బాడీని చల్లబరుస్తుంది. పచ్చి మామిడి ముక్కలను నమలడం వల్ల లాలాజలం, పిత రసం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి, ప్రేగులలో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను అరికట్టడానికి ఎంతగానో తోడ్పడుతుంది. పచ్చి మామిడికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, దీనిని అతిగా తినకూడదు. ముఖ్యంగా కాయ కోసినప్పుడు వచ్చే జిగురు నోటికి లేదా పెదవులకు అంటకుండా జాగ్రత్తపడాలి, లేదంటే బొబ్బలు వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha