Dailyhunt
ఎండల దెబ్బ.. స్విగ్గీ, జెప్టోలో పెరిగిన కూలింగ్ ప్రొడక్ట్స్ డిమాండ్

ఎండల దెబ్బ.. స్విగ్గీ, జెప్టోలో పెరిగిన కూలింగ్ ప్రొడక్ట్స్ డిమాండ్

వార్త 1 week ago

Quick Commerce Sales: భారతదేశ వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.

ఈ తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ వంటి సంస్థల్లో కూలింగ్, హైడ్రేషన్ ఉత్పత్తుల అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి.

ప్రముఖ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మార్చి చివరి వారంతో పోలిస్తే, సీజనల్ ఉత్పత్తుల అమ్మకాలు ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయని వెల్లడించింది. ముఖ్యంగా కోల్డ్ కాఫీ, మామిడి పళ్ల అమ్మకాలు 10 రెట్లు పెరగడం విశేషం. ఐస్‌క్రీమ్, శీతలపానీయాలు, పుచ్చకాయలతో పాటు పెరుగుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దేశవ్యాప్త ఐస్‌క్రీమ్ అమ్మకాల్లో ఒక్క బెంగళూరు నగరమే 14 శాతం వాటాను కలిగి ఉండగా, మామిడి పళ్ల ఆర్డర్లలో మూడింట ఒక వంతు వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు తర్వాత చెన్నై, హైదరాబాద్ నగరాలు అత్యధిక ఆర్డర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Read Also : PM Modi Telangana Tour: మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్

Quick Commerce Sales: జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో వింత ట్రెండ్స్

మరోవైపు జెప్టో ప్లాట్‌ఫారమ్‌లో కేవలం ఆహార పదార్థాలే కాకుండా సన్‌స్క్రీన్, ఇన్‌స్టంట్ డ్రింక్ మిక్స్‌లు, టాల్కమ్ పౌడర్ వంటి వాటికి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. వేడి నుంచి రక్షణ కోసం ఫ్యాన్లు, గొడుగులు కూడా నిత్యావసరాలుగా మారాయి. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ నివేదిక ప్రకారం, చేతి విసనకర్రల (హ్యాండ్ ఫ్యాన్లు) అమ్మకాలు ఏకంగా44 రెట్లు పెరగడం గమనార్హం. వీటితో పాటు హైడ్రేషన్ డ్రింక్స్, స్విమ్‌వేర్, కీటక నివారిణుల అమ్మకాలు కూడా భారీగా వృద్ధి చెందాయి.

బిగ్‌బాస్కెట్‌లో 100 శాతం వృద్ధి

టాటా గ్రూప్‌కు చెందిన బిగ్‌బాస్కెట్‌లో ఐస్‌క్రీమ్‌ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 100 శాతం వృద్ధిని సాధించాయి. అమెజాన్ నౌ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇదే తరహా ట్రెండ్‌ను నివేదిస్తున్నాయి. ఎండలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బిల్లు షేర్ చేయమంటే బంధమే వద్దంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha