Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎండల వేడికి బ్రేక్: ఈనెల 26నే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!

ఎండల వేడికి బ్రేక్: ఈనెల 26నే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!

వార్త 1 week ago

దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతతో, భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నట్లు అంచనా వేసింది.

మే 26 నాటికే ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Read Also: Petrol Price Hike: ఎన్నికలు అవ్వగానే పెట్రోల్ బాదుడు.. కేంద్రంపై ఎమ్మెల్యే యెన్నం ఫైర్!

 Southwest Monsoon

Southwest Monsoon: రుతుపవనాల గమనం – ముఖ్యాంశాలు

ముందస్తు రాక: సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. అయితే ఈసారి దాదాపు ఐదు రోజుల ముందే అంటే మే 26నే ఇవి ప్రవేశించే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల ఈ రుతుపవనాల రాక అంచనా వేసిన తేదీ కంటే నాలుగు రోజులు ముందుగా (మే 22) లేదా నాలుగు రోజులు ఆలస్యంగా (మే 30) జరిగే అవకాశం కూడా ఉందని IMD స్పష్టం చేసింది. కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఇవి క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణిస్తూ దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు విస్తరిస్తాయి. దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాలానికి ఇది ఆరంభం కానుంది. గత ఏడాది (2025) నైరుతి రుతుపవనాలు మరింత ముందస్తుగా మే 24వ తేదీనే కేరళ తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ ఈ సందర్భంగా గుర్తు చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha