Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంజీబీఎస్ మార్గంలో వాహనాలు నిలిపివేత

ఎంజీబీఎస్ మార్గంలో వాహనాలు నిలిపివేత

వార్త 2 days ago

Dilsukhnagar traffic:హైదరాబాద్ నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కారణంగా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ట్యాంక్‌బండ్ వైపు వేలాది విగ్రహాలు వరుసకట్టడంతో నగరం అంతటా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఎల్బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వచ్చే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు రోడ్డుపైనే నిలిచిపోయి ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఈ పరిస్థితి తీవ్రమవడంతో పోలీసులు హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Palapitta Rescue: దసరా వేళ 4 పాలపిట్టలకు విముక్తి.. సీపీ సజ్జనార్‌ కీలక చర్య

 Big alert for Hyderabad bus passengers

బస్సులు ఎక్కడికక్కడే బంద్

ట్రాఫిక్ తిప్పలు తప్పించడానికి పోలీసులు జిల్లాల నుంచి వస్తున్న బస్సుల వేగానికి దిల్‌సుఖ్‌నగర్ దగ్గరే చెక్ పెట్టారు. ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వెళ్లాల్సిన వాహనాలను ముందుకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో వచ్చే ప్రజలు దిల్‌సుఖ్‌నగర్‌లోనే దిగిపోవాలని పోలీసులు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. చంటిపిల్లలు, లగేజీతో వస్తున్న ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరలేక రోడ్లపైనే తీవ్ర తీవ్రమైన అవస్థలు పడుతున్నారు.

Dilsukhnagar traffic:ప్రయాణం ఉంటే కాసేపు ఆగాల్సిందే

విగ్రహాల ఊరేగింపు ముగిసే వరకు నగరం వైపు రాకపోకలు సాగించడం కష్టమని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ప్రయాణికులు ట్రాఫిక్ లేని ప్రత్యామ్నాయ దారులను వెతుక్కోవడం మేలని చెబుతున్నారు. రోడ్లపై ఉన్నవారు పోలీసుల సూచనలకు సహకరిస్తేనే పరిస్థితి త్వరగా అదుపులోకి వస్తుందని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు.

Epaper: epaper.vaartha.com

నేడు ఘనంగా దత్తన్న అలయ్ బలయ్ వేడుక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha