Dailyhunt
ఎన్ని పార్టీలు అయినా విజయం మాదే: తమిళనాడు సీఎం స్టాలిన్

ఎన్ని పార్టీలు అయినా విజయం మాదే: తమిళనాడు సీఎం స్టాలిన్

వార్త 1 week ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ కూటమి 200 స్థానాల్లో గెలుస్తుందని భావించామని, కానీ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆయన కొలత్తూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.

Read Also: Mahatma Jyotirao Phule 200th Jayanti: మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి..ప్రధాని మోదీ, రాష్ట్రపతి నివాళులు

 Tamilnadu Elections

Tamilnadu Elections: తమిళనాడు వర్సెస్ దిల్లీ: స్టాలిన్ ప్రధాన నినాదం

ఈ ఎన్నికలను స్టాలిన్ కేవలం రాష్ట్ర స్థాయి పోరుగా కాకుండా, ‘తమిళనాడు వర్సెస్ దిల్లీ’గా అభివర్ణిస్తున్నారు.

  • ఏఐఏడీఎంకేపై విమర్శలు: ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే తన ఆత్మగౌరవాన్ని దిల్లీకి తాకట్టు పెట్టిందని, ఒక ద్రవిడ పార్టీ ఇలా లొంగిపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
  • లక్ష్యం: దిల్లీ పెద్దల పెత్తనాన్ని ఎదిరించి తమిళుల హక్కులను కాపాడటమే తమ కూటమి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

నటుడు విజయ్ ఎంట్రీపై స్పందన

తమిళ అగ్ర నటుడు విజయ్ (టీవీకే అధినేత) రాజకీయాల్లోకి రావడం మరియు యువత ఆయనను అనుసరించడంపై స్టాలిన్ ఆచితూచి స్పందించారు. కొందరు యువకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఘటనలపై ప్రస్తావిస్తూ, ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని, ఓటు రూపంలో వారే సరైన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్​ 23న ఒకే దశలో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. ప్రధాన పోటీ డీఎంకే నేతృత్వంలోని ఎస్​పీఏ (ఇందులో కాంగ్రెస్​, డీఎంకే, వీసీకే)కు, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్​ (బీజేపీ, పీఎంకే) మధ్య ఉంటుందని భావించారు. కానీ ఈసారి తమిళ అగ్ర నటుడు విజయ్ టీవీకే పార్టీ పెట్టి, ఎన్నికల బరిలోకి దిగారు. దీనితో తమిళనాట త్రిముఖ పోటీ నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మోదీ మహిళలకు క్షమాపణలు చెప్పాలి అంటూ కాంగ్రెస్ డిమాండ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha