Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీ మహిళలకు క్షమాపణలు చెప్పాలి అంటూ కాంగ్రెస్ డిమాండ్

మోదీ మహిళలకు క్షమాపణలు చెప్పాలి అంటూ కాంగ్రెస్ డిమాండ్

వార్త 2 months ago

హిళా రిజర్వేషన్ చట్టం అమలుపై మోదీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని కాంగ్రెస్ విమర్శించింది. మోదీ సర్కార్​ తన పాలనా వైఫల్యాలను, విదేశాంగ విధానంలో తగిలిన ఎదురుదెబ్బలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

2024 ఎన్నికల నుంచే తాము ‘నారీ శక్తి వందన్​ అధినియం-2023’ (మహిళా రిజర్వేషన్​ చట్టం)ను అమలు చేయాలని కోరుతున్నామని, కానీ అలా చేయకుండా జాప్యం చేస్తున్న ప్రధాని మోదీ భారత మహిళలకు ‘క్షమాపణ’ చెప్పాలని డిమాండ్ చేసింది.

Read Also: Nitish Kumar as a member of Rajya Sabha: బిహార్ రాజకీయాల్లో నూతన అధ్యాయం: రాజ్యసభ సభ్యునిగా నీతీశ్‌ కుమార్

 Modi Apology

Modi Apology: ఎన్నికల సంఘం హోం శాఖకు లోబడి పనిచేస్తోంది: జైరాం రమేశ్

ఎన్నికల సంఘం కేంద్ర హోం శాఖకు లోబడి పనిచేస్తోందని జైరాం రమేశ్ ఆరోపించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో 30 నెలల తర్వాత ప్రధాని తన మనస్సు మార్చుకున్నారు. వాస్తవానికి జనగణన, పునర్విభజనను మనం మర్చిపోవాలని మోదీ కోరుకుంటున్నారు. 2027 నాటికి ఫలితాలు వస్తాయని సెన్సెస్​ రిజిస్ట్రార్ స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన ఇలా చేస్తున్నారు. తమిళనాడు, బంగాల్​ మహిళలు బీజేపీ వైపు మొగ్గుచూపుతారనే ఆశతో ఇదంతా చేస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో మరే ఇతర అంశంపై మాట్లాడడానికి బీజేపీ దగ్గర సరైన మ్యాటర్ లేదు’ అని జైరాం రమేశ్ ఆరోపించారు. పైగా మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై తీసుకున్న యూటర్న్​కు కూ డా మోదీ క్రెడిట్ తీసుకోవడంపై జైరాం రమేశ్ మండిపడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha