Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్నికల హామీ అమలు.

ఎన్నికల హామీ అమలు.

వార్త 3 weeks ago

4 వ వార్డు బీ.సీ కాలనీలో ఆసరా పింఛన్ కేంద్రం ఏర్పాటు…

Ramayampet Municipality: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుకు శ్రీకారం చుట్టారు .

ప్రజలకు అవసరమైన సేవలను వారి ఇంటి ముంగిటకే తీసుకురావాలనే సంకల్పంతో రామాయంపేట మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలో నీ బి సి కాలనీలో ఆసరా పింఛన్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శనివారం నాడు మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు చొరవతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇకపై పింఛన్ కోసం 2 కిలో మీటర్లు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశారు. తమ కాలనీలోని సౌకర్యవంతంగా సేవలు పొందే అవకాశం కలిగింది.

Read Also: Osmania Hospital : ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్..ఫ్రీ గా సర్జరీలు

 Implementation of election assurance

Ramayampet Municipality: కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

వార్డు ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ లక్ష్యం అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, బైరం స్వప్న కుమార్, గుగులోత్ రవి, కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, కాంగ్రెస్ నాయకులు దాకి స్వామి, పోచమ్మల గణేష్, మోబిన్, బైరం కుమార్, 4వ వార్డు సభ్యులు పోచమ్మల నారాయణ, ఖదీర్ బాయ్, చిలుక విరాట్, తాహెర్, ఆశామ్, కృష్ణ, రవి, జొన్నల రవి తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నాకు స్పీకర్ పదవి వద్దు.. మంత్రి పదవి కావాలి:గడ్డం ప్రసాద్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha