Dailyhunt
ఎన్నికల ముందు బెంగాల్ రాజకీయాల్లో వేడి

ఎన్నికల ముందు బెంగాల్ రాజకీయాల్లో వేడి

వార్త 3 weeks ago

ఎన్నికల ముందు మమతా సంచలన వ్యాఖ్యలు

West Bengal Election : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీతో పాటు తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అధికారుల బదిలీలపై విమర్శలు

నడియా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ నుంచి పెద్ద సంఖ్యలో IAS, IPS అధికారులను తమిళనాడుకు ఎన్నికల అబ్జర్వర్లుగా పంపించినట్లు పేర్కొన్నారు. దాదాపు 500 మంది అధికారులను బదిలీ చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి పనులు ప్రభావితమయ్యాయని ఆమె అన్నారు.

Read Also : Virat Kohli Record: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!

 West Bengal Election

బీజేపీపై దీదీ విమర్శలు

బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపలు, మాంసం, గుడ్లు తినడాన్ని కూడా నిషేధించే అవకాశం ఉందని మమతా బెనర్జీ విమర్శించారు. అంతేకాదు ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సవరణల కారణంగా పశ్చిమ బెంగాల్‌లో 250 మంది మరణించినట్లు పేర్కొంటూ దీనికి బీజేపీ బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తానని కూడా తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ట్రంప్ కు పదవి గండం ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha