ఎన్నికల ఫలితాల అనంతరం తన పార్టీ సాధించిన ఘన విజయంపై టీవీకే అధినేత విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ గెలుపు కేవలం తనది మాత్రమే కాదని, మార్పును కోరుకున్న కోట్లాది మంది తమిళ ప్రజలదని ఆయన అభివర్ణించారు.
“ఈ ఎన్నికల్లో ధనస్వామ్యం ఓడిపోయింది, ప్రజాస్వామ్యం గెలిచింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షాలు ఎంతగా ప్రలోభాలకు గురిచేసినా, ప్రజలు మాత్రం సిద్ధాంతాలకు, మార్పుకు పట్టం కట్టారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Read ALso : TVK విజయ్ విజయం వెనుక ప్రధాన సూత్రధారి అతడే !!
Vijay Swearing in as Tamil Nadu CMసవాళ్లను అధిగమించి.. ప్రజల అండతో ముందడుగు
పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎదురైన ఆటంకాలను విజయ్ తన పోస్ట్‌లో గుర్తు చేసుకున్నారు. కొత్త పార్టీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లినప్పుడు ఎన్నో విమర్శలు, రాజకీయ సవాళ్లు ఎదురయ్యాయని, కానీ తమిళ ప్రజలు మాత్రం తమపై నమ్మకాన్ని ఉంచారని తెలిపారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఇంతటి భారీ ఆదరణ లభించడం పట్ల ఆయన తమిళ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పరిపాలన కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటుందని, మరింత మంది తనకు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం
దశాబ్దాల కాలంగా రెండు ప్రధాన పార్టీల మధ్యే నలిగిపోతున్న తమిళ రాజకీయాల్లో విజయ్ రాకతో సరికొత్త అధ్యాయం మొదలైంది. మార్పు కోసం ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ ఫలితాలు నిరూపించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్య ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని విజయ్ తన సందేశంలో స్పష్టం చేశారు. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో తమిళనాడును అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

