Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVK విజయ్ విజయం వెనుక ప్రధాన సూత్రధారి అతడే !!

TVK విజయ్ విజయం వెనుక ప్రధాన సూత్రధారి అతడే !!

వార్త 1 month ago

మిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తూ విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ సృష్టించిన సంచలనం వెనుక ఒక బలమైన వ్యూహకర్త హస్తం ఉందనే చర్చ జోరందుకుంది.

ఆ వ్యూహకర్తే కపిల్ సాహు. గతంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ IPACలో కీలక బాధ్యతలు నిర్వహించిన కపిల్, ఆ తర్వాత విజయ్ కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. పార్టీ స్థాపన నుంచి ఎన్నికల ముగింపు వరకు ప్రతి అడుగులోనూ విజయ్‌కు వెన్నంటి ఉండి, రాజకీయాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన దళపతిని ఒక పరిణతి చెందిన నాయకుడిగా ప్రజల్లో నిలబెట్టడంలో కపిల్ సాహు కీలక పాత్ర పోషించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : టీఎంసీలో 'టికెట్ల' బేరం.. ఒక్కొక్కటి రూ. 5 కోట్లు: మాజీ మంత్రి మనోజ్ తివారీ

వివాదాల నుంచి విజయ తీరాలకు.. పక్కా స్ట్రాటజీ

రాజకీయాల్లోకి రాగానే ఎదురయ్యే సవాళ్లను కపిల్ సాహు అత్యంత చాకచక్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కరూర్ తొక్కిసలాట ఘటన మరియు విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్థులు చేసిన విమర్శల సమయంలో విజయ్ ఇమేజ్ దెబ్బతినకుండా కపిల్ పక్కా వ్యూహాలను అమలు చేశారు. గతంలో ‘హోంబలే ఫిల్మ్స్’ వంటి భారీ చిత్ర నిర్మాణ సంస్థల సక్సెస్‌లో భాగస్వామిగా ఉన్న ఆయన, సినిమా మార్కెటింగ్ మెళకువలను రాజకీయాలకు అన్వయించారు. “ఒక స్టార్‌ను నాయకుడిగా ఎలా మార్చాలి?” అనే విషయంలో ఆయన అనుసరించిన ప్రచార శైలి పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారింది.

క్షేత్రస్థాయి విశ్లేషణ.. అధికారం దిశగా అడుగులు

కేవలం సోషల్ మీడియా ప్రచారానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో కపిల్ సాహు బృందం విజయవంతమైంది. తమిళనాడులోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న కుల సమీకరణాలు, యువత ఆకాంక్షలు మరియు ప్రభుత్వ వ్యతిరేకతను విశ్లేషించి విజయ్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు అందించారు. ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగానే విజయ్ తన ప్రసంగాలను, హామీలను రూపొందించుకున్నారు. పక్కాగా రూపొందించిన ఈ రాజకీయ వ్యూహాలే నేడు TVK పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రధాన సూత్రధారిగా నిలిచాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మమతా ఓటమికి కారణం వారి ఓట్ల చిలికే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha