Saina Nehwal : భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపియన్ సైనా నెహ్వాల్ రాజకీయ రంగప్రవేశం మరియు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మరోసారి (Saina Nehwal) స్పందించారు.
దేశాభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ (BJP) చేపడుతున్న కార్యక్రమాలు నచ్చి తాను ఆ పార్టీలో చేరానని ఆమె స్పష్టం చేశారు.
అవకాశం వస్తే పరిశీలిస్తానని :
ఓ ఇంటర్వ్యూలో భాగంగా భవిష్యత్తులో అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంపై మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని, అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయినప్పటికీ భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే పరిశీలిస్తానని, దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

హర్యానాలో జన్మించిన సైనా నెహ్వాల్, తన తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పుల్లెల గోపీచంద్ వద్ద బ్యాడ్మింటన్ మెళకువలు నేర్చుకున్న ఆమె, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు అనేక పతకాలు సాధించిపెట్టి దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఎదిగారు. క్రీడా రంగం ద్వారా దేశానికి సేవలందించిన తను, ఇకపై రాజకీయాల ద్వారా దేశాభివృద్ధిలో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు గతంలోనే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
Read Also hindi news: hindi.vaartha.com
సీఎం చంద్రబాబు స్పందించి జూడాల డిమాండ్లను పరిష్కరించాలి : వైఎస్ జగన్

