Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం చంద్రబాబు స్పందించి జూడాల డిమాండ్లను పరిష్కరించాలి : వైఎస్ జగన్

సీఎం చంద్రబాబు స్పందించి జూడాల డిమాండ్లను పరిష్కరించాలి : వైఎస్ జగన్

వార్త 3 weeks ago

YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) చేస్తున్న సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, (YS Jagan) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడికి ఆయన హితవు పలుకుతూ, వెంటనే జూడాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.

శ్రమతోనే వైద్యసేవలు సజావుగా సాగుతున్నాయని :

రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో, వారి శ్రమతోనే వైద్యసేవలు సజావుగా సాగుతున్నాయని జగన్ గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని మెరుగైన స్టైపెండ్ పెంపు కోరుతున్న జూడాలపై కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం సరికాదని ఆయన తప్పుపట్టారు.

సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, దీనివల్ల పేద రోగులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పంతాన్ని వీడి, జూడాల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని కోరారు. తక్షణమే తగిన స్థాయిలో స్టైపెండ్‌ను పెంచి, సమ్మెను విరమింపజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును జగన్ కోరారు.

H-1B వీసా ఫీజు భారీగా పెరగనుందా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha