UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వ్యాపారులకు (Merchants) వినియోగదారులు చేసే యూపీఐ (UPI) పేమెంట్లపై నిర్దిష్ట ఛార్జీల పట్టిక అమల్లోకి వచ్చింది.
అయితే ఈ ఛార్జీలు సాధారణ వినియోగదారులకు కాకుండా కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తాయి. వ్యాపార పరిమాణాన్ని బట్టి, చిన్న వ్యాపారులకు ఊరటనిస్తూ నెలకు లక్ష రూపాయలలోపు వ్యాపారం చేసే వారికి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించడం లేదు. కానీ, ఆపైన జరిగే పెద్ద మొత్తాల లావాదేవీలపై చెల్లింపు పరిమాణాన్ని బట్టి రుసుములు వర్తిస్తాయి. రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు చేసే చెల్లింపులకు రూ. 5.50, రూ. 3,000 పైబడిన లావాదేవీలకు రూ. 12 ఛార్జీగా నిర్ధారించారు. అదేవిధంగా రూ. 50,000 వరకు చెల్లిస్తే రూ. 200, అలాగే రూ. 75,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిపే పెద్ద లావాదేవీలపై గరిష్టంగా రూ. 300 వరకు MDR వసూలు చేయనున్నారు.
UPIముఖ్య రంగాలకు ఊరట – ఫిక్స్డ్ ఛార్జీలతో ఊరట కలిగిస్తున్న నిబంధనలు!
సాధారణ వ్యాపార లావాదేవీలపై శాతాల వారీగా, విలువ ఆధారంగా ఛార్జీలు ఉన్నప్పటికీ, నిత్యం ప్రజలకు అవసరమయ్యే కొన్ని కీలక రంగాలకు సర్కార్ ప్రత్యేక మినహాయింపులను ప్రకటించింది. రైల్వేలు, టెలికం, ఇన్సూరెన్స్ మరియు ఫ్యూయల్ (ఇంధనం) వంటి రంగాలు సాధారణ 0.4 శాతం MDR పరిధిలోకి రావు. ఈ రంగాల్లో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు జరిపినప్పుడు, చెల్లింపు మొత్తం ఎంత పెద్దదైనా సరే ఫిక్స్డ్‌గా కేవలం రూ. 5 మాత్రమే MDR ఛార్జీగా వర్తిస్తుంది. ఈ నిబంధనల వల్ల డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిగే పెట్రోల్ బంకులు, రైల్వే బుకింగ్‌లలో వ్యాపారులకు, సంస్థలకు ఛార్జీల భారం గణనీయంగా తగ్గనుంది.

