Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీలో అలరిస్తున్న 'లవ్ ఓ లవ్' మూవీ

ఓటీటీలో అలరిస్తున్న 'లవ్ ఓ లవ్' మూవీ

వార్త 3 weeks ago

Love O Love Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ మేనల్లుడు 'పవీష్' కథానాయకుడిగా, తెలంగాణ జానపద పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి 'నాగదుర్గ' కథానాయికగా నటించిన చిత్రం 'లవ్ ఓ లవ్'.

మగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో మంచి ఆదరణ పొందిన అనంతరం ప్రస్తుతం 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది.

Read Also : Prabhas Fauzi : 'ఫౌజీ'లో ప్రభాస్ తల్లిగా అలనాటి నటి ?

 The movie ‘Love O Love’ is entertaining audiences on OTT.

Love O Love Movie: కథ

రఘు (పవీష్) ఒక మధ్యతరగతి యువకుడు. కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ వచ్చిన జీతంతో, పద్ధతిగా జీవించే తండ్రి ఆధ్వర్యంలో కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో రఘుకి అవంతిక (నాగదుర్గ) అనే అమ్మాయితో పరిచయమేర్పడుతుంది. ఆమెపై ప్రేమ పెంచుకున్న రఘు, ఆమె కోరికలు తీర్చడానికి తన వద్ద డబ్బు లేకపోయినా అప్పులు చేయడం, బ్యాంక్ లోన్లు తీసి షాపింగ్‌లు, ఊటీ పర్యటనలకు తిప్పడం మొదలుపెడతాడు.

తీరా అవంతిక తల్లి, రఘు తమ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. రఘు ఉద్యోగం పోవడమే కాకుండా, అప్పుల పాలై బైక్ కూడా జప్తు అవుతుంది. కుటుంబం పరువు పోవడంతో తండ్రి ఊరు విడిచి వెళ్ళిపోతాడు. ఈ పరిస్థితుల్లో దుబాయ్ పారిపోతున్నాడనే నిందతో పోలీస్ స్టేషన్‌లో ఉన్న రఘు, అవంతిక విషయంలో ఏం చేశాడు? వారి ప్రేమ ఏ తీరానికి చేరింది అనేదే మిగతా కథ.

విశ్లేషణ

ఈనాటి ట్రెండ్‌లో ప్రేమించడం, బ్రేకప్ చెప్పుకోవడం చాలా సాధారణ విషయాలుగా మారిపోయాయి. ప్రేమ పేరుతో అబ్బాయిల ద్వారా అమ్మాయిలు ఇష్టానుసారంగా ఖర్చు చేయించడం, దాని వల్ల సదరు యువకులు ఎలాంటి ఆర్థిక, కుటుంబ సమస్యల్లో చిక్కుకుంటారు అనే అంశాన్ని దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు.

ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్ల పరిచయం, సరదా ప్రేమ సన్నివేశాలతో హాయిగా సాగిపోతుంది. ఇక సెకండాఫ్ మొదలయ్యేసరికి హీరో పెట్టిన ఒక ఊహించని షరతు కథకు ప్రధాన బలంగా మారుతుంది. ఈ పాయింట్ ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అయితే ప్రీ-క్లైమాక్స్ వరకు అమ్మాయిల ధోరణిని తప్పుబడుతూ వచ్చిన కథ, చివర్లో ఆ అంశాన్ని హఠాత్తుగా వేరే వైపు మళ్లించినట్టు అనిపించినా.. దర్శకుడు కథను సమర్థవంతంగానే బ్యాలెన్స్ చేశాడు.

నటీనటుల పనితీరు

హీరోగా పవీష్ తన నటనతో మెప్పించగా, హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి నాగదుర్గ మొదటి సినిమాలోనే ఆకట్టుకుంది. ప్రధాన పాత్రధారులందరూ తమ పరిధి మేర బాగా నటించారు.ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ ఈ కథకు సరిగ్గా సరిపోయాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో వచ్చే సంభాషణలు (డైలాగ్స్) వీక్షకులకు బలంగా కనెక్ట్ అవుతాయి.

ముగింపు

ప్రేమించడం తప్పు కాదు.. కానీ ప్రేమను ఆసరాగా చేసుకుని భాగస్వామితో ఇష్టానుసారం ఖర్చు చేయించకూడదు అనే ఆలోచించదగ్గ మెసేజ్‌ను ఈ చిత్రం ఇస్తుంది. అంతేకాక నిజమైన ప్రేమ నిందలు వేయదు.. మన్నిస్తుంది అని యువతకు గుర్తుచేస్తుంది. కుటుంబ సమేతంగా, ముఖ్యంగా నేటి యువత తప్పక చూడాల్సిన కంటెంట్ ఉన్న చిత్రమిది.

ఆగస్టులోనే బిగ్‌బాస్ 'అగ్నిపరీక్ష' ప్రసారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha