PM Modi Greetings: తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు.
ఎన్టీఆర్ ప్రజా సంక్షేమానికి, సుపరిపాలనకు చేసిన కృషిని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. పేదలు, సమాజంలో వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ఎన్టీఆర్ చూపిన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ పేర్కొన్నారు.
Read Also :Vijay Meets Modi : మోదీతో ముగిసిన విజయ్ సమావేశం

సినిమా, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి – పిఎం మోదీ
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అఫీషియల్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ భావోద్వేగ భరితమైన పోస్ట్ చేశారు. “మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు. ప్రజా సంక్షేమం, పేదల ఆత్మగౌరవ రక్షణ కోసం ఆయన చేసిన పరిపాలన ఎల్లప్పుడూ స్మరణీయం. సినీ రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉంటాయి. ఆయన జీవితం, ఆదర్శాలు మనందరికీ ఎనలేని స్ఫూర్తిదాయకం. ఆంధ్రప్రదేశ్‌లో నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వం.. ప్రజల కోసం ఎన్టీఆర్ గారు కన్న కలలను, ఆయన ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉంది” అని ప్రధాని స్పష్టం చేశారు.
PM Modi Greetings: దేశ ప్రజలకు ఈద్-ఉల్-అజ్హా శుభాకాంక్షలు
మరోవైపు పవిత్ర ఈద్-ఉల్-అజ్హా (బక్రీద్) పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరసోదరీమణులకు, దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ సమాజంలో సోదరభావాన్ని, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయం సిద్ధించాలని ప్రధాని తన సందేశంలో ప్రార్థించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్!

