NTR Bharosa Pension: 'ప్రజలే దేవుళ్లు - సమాజమే దేవాలయం' అనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌర వాన్ని కాపాడారని, వృద్ధులు, వికలాంగు లు, వితంతువులకు ఎవరి పైన ఆధారప డకుండా పింఛన్లు అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.
ఆయన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పెన్షన్ల పండుగ జరుగుతోందన్నారు.
Read Also: Ghantasala statue tribute: తిరుపతిలో ఘంటసాల స్మరణ.. ప్రతి నెల నివాళి కార్యక్రమం
MLA Amilineni Surendrababu distributed NTR Bharosa pensions in Krishnapuram, Kundurpi mandal.
NTR Bharosa Pension: కృష్ణాపురంలో పెన్షన్ల పంపిణీ
బుధవారం నియోజక వర్గంలోని కుందుర్పి మండలం తూము కుంట గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అదే ప్రాంగణంలో పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కోసం ప్రజాప్రతి నిధులు కలిసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధించామని తెలిపారు. ధర్నాలు, పాదయాత్రలు చేసిన కారణంగా కాదని, మాజీ ఎంపీ తలారి రంగయ్య అంతా నేనే చేసానంటూ ర్యాలీలు చేసి ప్రజల్లో హాస్యాస్పదంగా మారారని విమర్శించారు.
తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ
గత ప్రభుత్వం ఐదేళ్లు అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిందన్నారు. కళ్యాణ దుర్గంలో అభివృద్ధి చేయకుండా తాగునీటి సమస్యలు కూడా పరిష్క రించలేకపోయారని ఆరోపించారు. ప్రస్తుతం వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైన చోట బోర్లు వేయిస్తు న్నామని తెలిపారు. తూము కుంట, కృష్ణాపురం గ్రామాల ఎస్సీ కాలనీల్లో తాగునీటి సమస్యలను వారంలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణాపురంలో భగీరథ విగ్రహానికి పైకప్పు నిర్మాణం కోసం రూ.50 వేల స్వంత నిధులు అందజే శారు. ప్రాథమిక పాఠశాలకు తరగతి గది మంజూరు చేయడంతో పాటు చిన్నా రులకు క్రికెట్ కిట్, స్కిప్పింగ్ పరికరాలు అందజేస్తామని తెలిపారు. గ్రా మ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు మండల కన్వీనర్ ధనుంజయ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీవో వసంత బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయ లక్ష్మీదేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

