Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్యూమరేషన్ ఫామ్ అందలేదా? అయితే ఇలా చెయ్యండి !

ఎన్యూమరేషన్ ఫామ్ అందలేదా? అయితే ఇలా చెయ్యండి !

వార్త 2 weeks ago

SIR : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'SIR' ఎన్యూమరేషన్ ఫామ్లు ఇంకా అందలేదని పలువురు ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై స్పందించిన ఎన్నికల సంఘం (EC), ఓటర్లు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

ఫామ్స్ అందని వారు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అందులో అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ల ద్వారా తమ ప్రాంతానికి సంబంధించిన బూత్ స్థాయి అధికారులను (BLO) నేరుగా సంప్రదించవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా, వెబ్‌సైట్‌లో ఉన్న ‘Book a Call with BLO’ అనే ప్రత్యేక ఆప్షన్ ద్వారా ఓటర్లు తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తే, సంబంధిత BLOల నుంచే నేరుగా కాల్ బ్యాక్ వచ్చేలా అత్యాధునిక సౌకర్యాన్ని కల్పించింది.

 SIR

ఆన్‌లైన్ ద్వారా డౌన్లోడ్.. గడువు వివరాలు ఇవే!

కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే కాకుండా, సాంకేతికతను ఉపయోగించుకుని ఓటర్లు స్వయంగా ఈ ప్రక్రియను పూర్తి చేసే వెసులుబాటు కూడా ఉంది. అర్హులైన ఓటర్లు సదరు వెబ్‌సైట్ నుండి నేరుగా SIR ఎన్యూమరేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫామ్‌ను పూర్తిగా నింపిన తర్వాత, తిరిగి అదే అధికారిక వెబ్‌సైట్‌లోనే ఆన్‌లైన్ ద్వారా సమర్పించే (Submit) సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అయితే, ఈ ఫామ్‌లను సమర్పించడానికి గడువు చాలా తక్కువగా ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్‌ల సమర్పణ గడువు ఆంధ్రప్రదేశ్‌లో జులై 14తో, అలాగే తెలంగాణలో జులై 24తో ముగియనుంది. కాబట్టి ఓటర్లు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎఐలోను 'మహిళా హక్కులు' అవసరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha