Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ చేనేతకు జాతీయ గుర్తింపు.. ఇద్దరు నేతన్నలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు

ఏపీ చేనేతకు జాతీయ గుర్తింపు.. ఇద్దరు నేతన్నలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు

వార్త 2 weeks ago

AP Handloom Awards 2025: ఆంధ్రప్రదేశ్ చేనేత రంగానికి జాతీయ స్థాయిలో మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 2025వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక 'జాతీయ చేనేత పురస్కారాలకు' రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన కళాకారులు ఎంపికయ్యారు.

తిరుపతి మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఈ నేతన్నలు తమ అద్భుతమైన చేనేత నైపుణ్యంతో ఈ గౌరవాన్ని సొంతం చేసుకుని రాష్ట్ర ఖ్యాతిని చాటారు.

వెంకటగిరి చీరలకు గుర్తింపు తెచ్చిన నక్కా వెంకటేశ్వరరావు

ఈ వివరాలను పరిశీలిస్తే.. వెంకటగిరి చీరల వైభవానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించిన తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు ‘ఉత్తమ మార్కెటింగ్’ విభాగంలో ఈ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. గడచిన ఆరు దశాబ్దాలుగా వీరి కుటుంబం చేనేత రంగాన్నే నమ్ముకుని, వెంకటగిరి పట్టు, నూలు వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది.

AP Handloom Awards 2025: పొందూరు కాటన్ జమ్దానీ నైపుణ్యంతో మురకల నటరాజ్

మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఆలికాం గ్రామానికి చెందిన మురకల నటరాజ్ కూడా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. గత 15 ఏళ్లుగా చేనేత వృత్తిలో రాణిస్తున్న ఆయన, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘పొందూరు కాటన్’ ఉపయోగించి అత్యంత రమణీయమైన జమ్దానీ చీరలను తయారు చేయడంలో విశేష నైపుణ్యం సాధించారు. స్వయంగా నేత నేయడమే కాకుండా, దాదాపు 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ చేనేత రంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆగస్టు 7న 'జాతీయ చేనేత దినోత్సవం' వేడుకల్లో అవార్డుల ప్రదానం

ఈ జాతీయ పురస్కారాలకు ఎంపికైన ఏపీ నేతన్నలు ఇద్దరూ 2026, ఆగస్టు 7న నిర్వహించే 12వ జాతీయ చేనేత దినోత్సవ (National Handloom Day) వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అధికారికంగా ఈ అవార్డులను అందుకోనున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టోకెన్ల జారీ రద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha