Tirumala: ఏడుకొండలవాడి దర్శనానికి తిరుమలలో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. భక్తుల భద్రత మరియు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని, వరుసగా నాలుగో వారం కూడా ఉచిత సర్వదర్శనం (SSD) టోకెన్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
దీని ప్రకారం, బుధవారం పంపిణీ చేయాల్సిన గురువారం నాటి ఉచిత దర్శన టోకెన్ల కోటాను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

తిరుపతి కేంద్రాల్లో టోకెన్ల జారీ నిలిపివేత
భక్తుల ప్రవాహం తగ్గకపోవడంతో తిరుపతి నగరంలో అమర్చిన మూడు ప్రధాన టోకెన్ పంపిణీ కేంద్రాల్లో బుధవారం నాటి కౌంటర్లను మూసివేస్తున్నట్లు పాలకమండలి తెలిపింది. అయినప్పటికీ, భక్తులకు భరోసా ఇస్తూ శుక్రవారం నాటి శ్రీవారి దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుండి యథావిధిగా సర్వదర్శనం టోకెన్ల పంపిణీని పునఃప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.
Tirumala: వేగంగా ముగిసిన కోటా.. వేలాదిగా తిరుమలకు ప్రయాణం
మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకే బుధవారం నాటి దర్శనానికి సంబంధించిన 10,000 సాధారణ ఉచిత టోకెన్లు, అలాగే కాలినడకన వెళ్లే భక్తుల కోసం కేటాయించిన 2,000 దివ్యదర్శనం టోకెన్ల కోటా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూసినప్పటికీ టోకెన్లు దొరకకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఏదీ ఏమైనా స్వామివారిని దర్శించుకోవాలనే తపనతో టోకెన్లు లేకపోయినప్పటికీ నేరుగా తిరుమల కొండపైకి పయనమయ్యారు. దీంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కాస్త అసౌకర్యానికి గురవుతున్నారు.
పట్టాల పంపిణీలో నారా లోకేశ్ .. మంగళగిరిలో 7.30 గంటల కార్యక్రమం

