Vijay Deverakonda Rashmika: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఒకవైపు రాజకీయ ప్రముఖులతో విందు, మరోవైపు సొంత ఊరిలో విద్యార్థుల కోసం సేవా కార్యక్రమం..
ఇలా రెండు భిన్నమైన సందర్భాల్లోనూ ఈ జంట కలిసి సందడి చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Read also: Anil Ravipudi New Movie: వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోతో కొత్త మూవీ టైటిల్ ఫిక్స్?
Vijay Deverakonda and Rashmika Mandanna have dinner at AP Deputy Speaker Raghurama’s residence!
Vijay Deverakonda Rashmika: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇంట్లో విందు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (ఆర్‌ఆర్‌ఆర్) ఇచ్చిన ప్రత్యేక విందుకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హాజరయ్యారు. రఘురామకృష్ణరాజు స్వయంగా విజయ్, రష్మికలను వారి కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్‌కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం వారితో దిగిన ఫొటోలను ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. “ఈ సాయంత్రం ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు వారి కుటుంబ సభ్యులతో పాటు మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. అద్భుతమైన వ్యక్తులతో సరదాగా మాట్లాడటం, వారితో గడిపిన సమయం మరపురానిది” అంటూ ఆయన ట్వీట్ చేశారు. రఘురామ ట్వీట్‌కు రష్మిక కూడా స్పందిస్తూ.. “మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్, ఇది ఒక అద్భుతమైన సాయంత్రం” అని రీ-ట్వీట్ చేశారు.
సొంత ఊరిలో విద్యార్థులకు 'దేవరకొండ ఫౌండేషన్' స్కాలర్‌షిప్‌లు
మరోవైపు విజయ్ దేవరకొండ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలం తుమ్మనపేటలో ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’ తరఫున ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్, రష్మిక జంటగా హాజరుకావడం విశేషం. వీరితో పాటు స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన 181 మంది విద్యార్థులకు వారు స్వహస్తాలతో స్కాలర్‌షిప్ చెక్కులను అందజేశారు. అందులో భాగంగా ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ. 10,000, సెకండ్ ర్యాంకు సాధించిన వారికి రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందించి వారిని ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించారు. బ్యాక్-టు-బ్యాక్ ఈవెంట్స్‌లో విజయ్, రష్మిక జంటగా కనిపించడం టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

