Anil Ravipudi New Movie: టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఇండస్ట్రీలో దాదాపు 100 శాతం సక్సెస్ రేటును కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వస్తోందంటే చాలు, అనిల్ రావిపూడి సినిమా థియేటర్లలో నవ్వుల పంట పండించడం ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. గత ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం', ఈ ఏడాది 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాలతో వరుస బ్లాక్‌బస్టర్లు అందుకుంటూ టాప్ డైరెక్టర్ల రేసులో మరింత ఎత్తుకు ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి చిత్రంగా టాలీవుడ్‌లో మరో భారీ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు.
Title finalized for the new movie starring the Venkatesh-Kalyan Ram combo?
Anil Ravipudi New Movie: టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్‌తో ‘F2’, ‘F3’, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి బ్యాక్-టు-బ్యాక్ హిట్లు అందుకున్న అనిల్.. కళ్యాణ్ రామ్‌తో తన తొలి చిత్రం ‘పటాస్’తో బంపర్ హిట్ సాధించారు. ఇప్పుడు వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూపించబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి.
ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టైటిల్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. పండుగ వాతావరణానికి, అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి సరిగ్గా సరిపోయేలా ఈ చిత్రానికి 'సంక్రాంతి సరుకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. పండుగ సీజన్ టార్గెట్‌గా వస్తున్న సినిమా కావడం వల్ల ఈ టైటిల్ అయితే మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బలంగా రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
కేరళలో హ్యాపీ రీ-రిలీజ్.. కొత్త సినిమా రేంజ్‌లో రికార్డు కలెక్షన్లు

