Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ ఇంటర్ ఫలితాలు.. 81% ఉత్తీర్ణతతో రికార్డు ఫలితాలు!

ఏపీ ఇంటర్ ఫలితాలు.. 81% ఉత్తీర్ణతతో రికార్డు ఫలితాలు!

వార్త 2 months ago

AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం (ఏప్రిల్ 15, 2026) ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు.

ఈ ఏడాది ఫలితాల్లో గత 12 ఏళ్ల రికార్డులు బ్రేక్ కావడం విశేషం.

Read Also:AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఇవే!

రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత

ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు గణనీయమైన పురోగతిని కనబరిచారు.

  1. ఇంటర్ ప్రథమ సంవత్సరం: 77 శాతం ఉత్తీర్ణత నమోదైంది (గత 12 ఏళ్లలో ఇదే అత్యధికం).
  2. ఇంటర్ ద్వితీయ సంవత్సరం: 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు (గత 12 ఏళ్లలో ఇది రెండో అత్యుత్తమ ఫలితం). మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, అందులో ఫస్టియర్ నుంచి 5.31 లక్షలు, సెకండియర్ నుంచి 5.26 లక్షల మంది ఉన్నారు.

ఫలితాలు ఇలా చూసుకోండి:

విద్యార్థులు తమ మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌పై రద్దీ ఎక్కువగా ఉంటే, ప్రభుత్వం అందించిన 'మన మిత్ర' వాట్సాప్ సేవ (9552300009) ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్ పంపి, మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.

ఉద్యమ స్ఫూర్తితో ముందుకు

ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు నిరాశ చెందవద్దని, సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మరో అవకాశం ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఈసారి మెరుగైన ఫలితాలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha