Dailyhunt
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఇవే!

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఇవే!

వార్త 1 week ago

AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది.

విద్యార్థులు ఎటువంటి జాప్యం లేకుండా తమ ఫలితాలను చూసుకునేందుకు ప్రభుత్వం రెండు ప్రధాన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

Read Also:MP Byreddy Shabari : ఎంపీ బైరెడ్డి శబరి పీఏ మృతి!

అధికారిక వెబ్‌సైట్ ద్వారా

ఇంటర్ ఫలితాలను,ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ నంబరుకు Hi అని మెసేజ్‌ పంపించి, ఫలితాలు చిటికెలో పొందొచ్చు. విద్యార్ధులు తమ హాల్‌ టికెట్ నంబర్‌ ఎంటర్ చేసి సబ్‌మిట్‌ చేస్తే.. వెంటనే స్ర్కీన్‌పై మార్కులు ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌లో తీసుకొచ్చిన మార్పుల కారణంగా అదనంగా ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టు మార్కులను మార్కుల జాబితాలో విడిగా ఇస్తారని ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి రంజిత్‌ బాషా తెలిపారు.

AP Inter Results 2026: ‘మనమిత్ర’ వాట్సాప్ సేవ

కాగా రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు కలిపి మొత్తం 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 21 నుంచి మొదలవగా ఏప్రిల్‌ 14తో పూర్తయ్యింది. తొలుత ఏప్రిల్‌ 21లోగా ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనానికి హుటాహుటీనా పూర్తి చేశారు. ఇక మార్కుల ప్రాసెస్‌ ప్రక్రియను కూడా త్వరిత గతిన పూర్తిచేసిన విద్యాశాఖ ముందుగా నిర్ణయించిన సమయం కంటే ఇంకాస్త ముందుగానే ఫలితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. నిజానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణల వల్ల పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టింది. ఈ కారణంగానే మూల్యాంకనంలో కాస్త జాప్యం నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

శంషాబాద్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి గుట్టురట్టు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha