AP Ministers Singapore Tour: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ఏడుగురు మంత్రుల బృందం (కొన్ని నివేదికల ప్రకారం తొమ్మిది మంది) ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది.
ఈ పర్యటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ బృందంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం ఈ పర్యటనకు అయ్యే ఖర్చును భరించనుంది.
Read Also: Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
GO issued for ministers’ visit to Singapore.. Seven ministers to tour Singapore
AP Ministers Singapore Tour: శిక్షణలోని ప్రధాన అంశాలు
ఈ వారం రోజుల పర్యటనలో మంత్రులు సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా స్మార్ట్ గవర్నెన్స్ పాలనలో సాంకేతికతను జోడించి పారదర్శకతను పెంచడం. శాంతిభద్రతలు అధునాతన పద్ధతుల్లో లా అండ్ ఆర్డర్ నిర్వహణ. ఆర్థికాభివృద్ధి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాలు. డిజిటల్ గవర్నెన్స్ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం.
సింగపూర్ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. సింగపూర్ విధానాలు ఇక్కడెలా అమలు చేయవచ్చో అధ్యయనం చేయాలని రాష్ట్రంలో అమలు చేయగలిగే ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలని చెప్పారు. తెలుసుకున్నవి అందరికీ చెప్పి ఉత్తమ విధానాల అమలుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

