AP SSC Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించారు.
ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. మొత్తం 6,18,131 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది 81.14 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి అది 85.25 శాతానికి చేరుకోవడం విశేషం.
Read Also: CI Chinna Mallaiah Rape Case: మాజీ సీఐపై అత్యాచారం కేసు!
AP SSC Results: AP 10th class results released.. Girls are the ones in the mood
ఈ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. అమ్మాయిలు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 82.68 శాతం మంది పాస్ అయ్యారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5.22 శాతం ఎక్కువగా ఉత్తీర్ణులై తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,089 పాఠశాలల ఫలితాలను పరిశీలిస్తే, పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. అయితే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 57.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా 2,161 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఫలితాల్లో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత, ఈ విద్యాసంవత్సరంలో 78.39 శాతానికి పెరగడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, విద్యార్థుల అభివృద్ధి కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా పూర్తి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

