Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న బోయపాటి శ్రీను

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న బోయపాటి శ్రీను

వార్త 2 weeks ago

AP Local Body Elections: ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తన పౌర బాధ్యతను చాటుకుంటూ గుంటూరు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎలాంటి హడావుడి లేకుండా ఒక సామాన్య పౌరుడిలా సాధారణ వరుసలో నిలబడి ఆయన ఓటు వేయడం విశేషం.

సొంతూరిలో ఓటు వేసిన ప్రముఖ దర్శకుడు

గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామమైన పెదకాకానిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి బోయపాటి శ్రీను విచ్చేశారు. సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి, క్యూలైన్లో నిలబడి క్రమశిక్షణతో తన వంతు వచ్చినప్పుడు ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న స్థానికులు మరియు అభిమానులను ఆప్యాయంగా పలకరించి, కొద్దిసేపు ముచ్చటించారు.

AP Local Body Elections: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ముఖ్యం

ఎన్నికలు ఏవైనా సరే, ప్రముఖులు ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల సమాజంలో సానుకూల సందేశం వెళ్తుంది. ఇదే స్పూర్తితో బోయపాటి శ్రీను కూడా తన స్వస్థలానికి వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.

తిరుపతి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha