Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

తిరుపతి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

వార్త 2 weeks ago

Tirupati Laddu Case: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధి నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ప్రైవేట్ డెయిరీ ఎండీ మశ్చీంద్ర శాంతారామ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది.

Read Also :Amaravati floods: గుంటూరు, అమరావతి దారులలో నిలిచిన రాకపోకలు

ఏపీ వెలుపలకు విచారణ బదిలీ చేయాలని పిటిషన్

తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ వెలుపల జరగాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

Tirupati Laddu Case: ప్రస్తుతం ఉన్న పరిధిలోనే కేసు విచారణ

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేసే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ ప్రక్రియ యథావిధిగా ముందుకు సాగనుంది. ఈ పరిణామం లడ్డూ కల్తీ వ్యవహారంలో మరో కీలక మలుపుగా మారింది.

రాప్తాడు బాలికకు విజయవంతంగా ఆపరేషన్.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha