AP PGCET:ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ 2026 ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ ప్రవేశ ప్రక్రియ ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభిస్తుంది.
Read also: Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు అదనంగా రూ.100 కోట్లు - పవన్
AP PGCET Counselling 2026 Notification Released
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వివరాలు
అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఆ తరువాత విద్యార్థులు తమ ప్రాధాన్యతను బట్టి వెబ్ ఆప్మెంట్లు నమోదు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పిస్తారు.
AP PGCET:కౌన్సెలింగ్ ఆలస్యంపై విద్యార్థుల అసహనం
ఈ ఏడాది మే నెలలోనే పీజీసెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు వచ్చి దాదాపు మూడు నెలలు గడిచినా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు షెడ్యూల్ రావడంతో ప్రవేశాల ప్రక్రియపై స్పష్టత వచ్చింది.
Epaper: epaper.vaartha.com

