Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లికి వందనం పెండింగ్ అమౌంట్ డేట్ ఫిక్స్

తల్లికి వందనం పెండింగ్ అమౌంట్ డేట్ ఫిక్స్

వార్త 2 weeks ago

Talliki vandanam scheme:తల్లికి వందనం పెండింగ్ నిధుల జమ మరియు అర్హుల జాబితా వివరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం కింద అర్హత ఉండి ఇంతవరకు డబ్బులు అందని విద్యార్థులకు మరియు ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్తగా ప్రవేశాలు పొందిన వారికి త్వరలోనే నిధులు జమ కానున్నాయి.

గతంలో ఆగస్టు 30న జమ కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 7 లేదా 8 తేదీలలో లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాలలో ఈ ఆర్థిక సాయం జమ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read also: Construction of Temples : ఏపీలో ఆలయాల నిర్మాణాలకు సర్కార్ కీలక నిర్ణయం

 Pending funds for ‘Thalliki Vandanam’

కొత్త విద్యార్థులకు ప్రత్యేక అవకాశం

పాఠశాలలు మరియు కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ విడత ద్వారా లబ్ధి పొందనున్నారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు ఈ నిధులు నేరుగా జమ అవుతాయి.

Talliki vandanam scheme:రూ. 15 వేల ఆర్థిక సాయం వివరాలు

ఈ పథకం ద్వారా విద్యార్థులకు సంవత్సరానికి మొత్తం రూ. 15 వేల ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో పాఠశాలల నిర్వహణ నిమిత్తం రూ. 2 వేలు మినహాయించి మిగిలిన రూ. 13 వేలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ వారం వరుస సెలవులు ఉన్నందున సెప్టెంబర్ మొదటి వారంలో నిధుల విడుదల ప్రక్రియ పూర్తి కానుంది. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంతో పేద విద్యార్థులకు చదువు విషయంలో ఎంతో మేలు జరుగుతుంది.

Epaper: epaper.vaartha.com

గోదావరి పుష్కరాలకు అదనంగా రూ.100 కోట్లు - పవన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha