Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ పింఛన్ల పంపిణీ లో కొత్త మార్పు

ఏపీ పింఛన్ల పంపిణీ లో కొత్త మార్పు

వార్త 2 weeks ago

AP Pension New Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్‌దారులకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ విధానంలో ఒక చిన్న మార్పు జరగనుంది.

ఇప్పటివరకు మొత్తం పింఛన్ నగదును లబ్ధిదారుల చేతికే అందించగా, ఇకపై కొంత మొత్తం చేతికి మరియు మరికొంత మొత్తం నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో జమ కానుంది. ఈ మేరకు పింఛన్ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలుగా వర్గీకరించి పంపిణీ చేయనున్నారు.

ఇప్పటి వరకు ప్రతినెలా ఒకటో తేదీ రాగానే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వచ్చి మొత్తం డబ్బులు చేతికి ఇచ్చేవారు. ఇకపై జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ వాటా డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో డీబీటీ (DBT) ద్వారా పడతాయి. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులను మాత్రం సచివాలయ సిబ్బంది ప్రతినెలా ఇంటికే వచ్చి లబ్ధిదారుల చేతికి అందిస్తారు. ఈ కొత్త విధానంపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ CEO వాకాటి కరుణ స్పష్టతనిచ్చారు.

CM Chandrababu: కడప వేదికగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

 New change in AP pension distribution

AP Pension New Rules: ఎంత నగదు చేతికి ఇస్తారు? ఎంత ఖాతాలో పడుతుంది?

‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద లబ్ధిదారులకు లభించే పింఛన్ వివరాలు విభజన ప్రకారం ఈ క్రింది విధంగా ఉండనున్నాయి:

  • వృద్ధాప్య పింఛన్: వృద్ధులకు వచ్చే మొత్తం రూ. 4,000 పింఛనులో రూ. 3,800 రాష్ట్ర ప్రభుత్వ వాటా కాగా, దీనిని సచివాలయ సిబ్బంది ఒకటో తేదీన ఇంటికి వచ్చి చేతికి ఇస్తారు. మిగిలిన రూ. 200 కేంద్ర ప్రభుత్వ వాటా కావున, ఇవి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.
  • దివ్యాంగుల పింఛన్: దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ. 6,000 పింఛనులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ. 5,700 చేతికి అందిస్తారు. మిగిలిన రూ. 300 కేంద్ర ప్రభుత్వ వాటాగా డైరెక్ట్‌గా వారి బ్యాంక్ అకౌంట్‌లో పడతాయి.

బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

కేంద్రం ఇచ్చే వాటా డబ్బులు అకౌంట్‌లో జమ కావాలంటే లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కు కచ్చితంగా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ అనుసంధానం లేకపోతే కేంద్ర వాటా సొమ్ము జమ కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి పింఛన్ లబ్ధిదారులంతా వెంటనే తమ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి ఆధార్ సీడింగ్ ప్రక్రియను తనిఖీ చేసుకోవాలని, ఒకవేళ లింక్ కాకపోతే వెంటనే అనుసంధానం పూర్తి చేసుకోవాలని సూచించారు.

పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత తీసుకురావడం మరియు కేంద్ర నిధుల పంపిణీలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం. దీనివల్ల కేంద్రం నుంచి ఎంత సహాయం అందుతోంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం ఇస్తోంది అనే అంశంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. కాగా, ప్రతినెలా ఒకటో తేదీనే పింఛను పంపిణీ జరుగుతుందని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

Epaper: epaper.vaartha.com

ఏపీ పాఠశాలల పై మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha