AP Police Technology: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచేందుకు పోలీస్ శాఖ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంది.
ఇందులో భాగంగా 'పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్' అనే అత్యాధునిక పరికరాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరికరం సాయంతో అనుమానితుల నేర చరిత్రను కేవలం సెకన్ల వ్యవధిలోనే తెలుసుకునే వీలుంటుంది.
Read Also : CM Chandrababu: రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
AP Police gets state of the art fingerprint device.
AP Police Technology: పరికరం పనితీరు
ఈ పాపిల్లాన్ స్కానర్ పరిమాణంలో చాలా చిన్నదిగా, మొబైల్ ఫోన్ అంత ఉంటుంది. దీనిని పోలీసులు తమ మొబైల్‌లోని ప్రత్యేక యాప్‌తో అనుసంధానిస్తారు. అనుమానిత వ్యక్తి బొటన వేలు లేదా చూపుడు వేలి ముద్రను స్కానర్‌పై ఉంచిన వెంటనే, ఆ వివరాలు పోలీస్ శాఖ కేంద్ర డేటాబేస్‌తో సరిపోల్చుకుంటాయి. సదరు వ్యక్తిపై రాష్ట్రంలో ఎక్కడైనా కేసులు ఉన్నా, రౌడీ షీట్ నమోదై ఉన్నా ఆ వివరాలన్నీ క్షణాల్లో మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఒకవేళ నేర చరిత్ర లేకపోతే ‘నాట్ ఫౌండ్’ అని చూపిస్తుంది.
నేర నివారణలో కీలక అస్త్రం
ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పాత నేరస్థులు, దొంగలు ప్రయాణికులతో కలిసిపోయి నేరాలకు పాల్పడుతుంటారు. వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా ఉండేది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని, ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేరస్థులను పట్టుకోవడం కష్టమయ్యేది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీ కాస్తున్న సిబ్బందికి అనుమానితులను విచారించినా, వారిపై కేసులు ఉన్నాయో? లేదో? తెలుసుకోవడానికి సమయం పట్టేది. ఈ సమస్యలకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు.
ఈ పాపిల్లాన్ స్కానర్ రాకతో పోలీసుల పనితీరు మరింత సులభతరం కానుంది. నేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అనుమానితుల వివరాలను వెంటనే ధృవీకరించుకోవడం ద్వారా నేరాలు జరగకముందే నివారించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా నేరాల నియంత్రణలో ఈ పరికరం ఒక కీలక సాధనంగా ఉపయోగపడనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
ప్రతి నెలా 4వ శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్' డే.. బాబు కీలక సమీక్ష

