Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

వార్త 2 months ago

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (ఏప్రిల్ 1, బుధవారం) నెల్లూరు మరియు కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు విభిన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఒకవైపు రాష్ట్రవ్యాప్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనుండగా, మరోవైపు కడప జిల్లాలోని ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Read Also : Chandrababu Naidu: సర్కార్ కానుక: నేతన్నలకు రేపటి నుండి ఉచిత విద్యుత్!

 CM Chandrababu Naidu to visit Nellore and Kadapa districts tomorrow.

CM Chandrababu: ఎన్టీఆర్ భరోసా: వింజమూరులో పింఛన్ల పంపిణీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా పేదలకు పెద్ద ఎత్తున నగదు బదిలీ జరుగుతోంది. గడిచిన 22 నెలల్లోనే ప్రభుత్వం పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు రూ.60,437 కోట్లను అందించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు గానూ రాష్ట్రవ్యాప్తంగా 62.60 లక్షల మంది పింఛనుదారులకు రూ.2,724 కోట్లను విడుదల చేసింది. సీఎం పర్యటించనున్న నెల్లూరు జిల్లాలో 2.91 లక్షల మందికి రూ.128 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గంలో 39,330 మందికి రూ.17.81 కోట్లు, వింజమూరు మండలంలో 5,484 మందికి రూ.2.47 కోట్లు పింఛన్ల రూపంలో అందనున్నాయి. ఉదయం 10:00 అమరావతి నుంచి వింజమూరుకు ప్రయాణం. 11:00 వింజమూరు ఉత్తర ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ. మధ్యాహ్నం 12:00: పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో ప్రసంగం. 2:15: ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం.

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

వింజమూరు పర్యటన ముగించుకుని, సాయంత్రం 4:25 గంటలకు సీఎం చంద్రబాబు కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకుంటారు. సాయంత్రం 6:15 గంటలకు కోదండరామస్వామి వారిని దర్శించుకుని, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత 6:45 గంటలకు కల్యాణ వేదిక వద్ద జరిగే శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి పాల్గొంటారు. స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందజేస్తారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి బుధవారం రాత్రి ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

పిఆర్సి నివేదికపై జాప్యమెందుకు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha