Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ పోలీసులకు శుభవార్త: 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ఎస్ఐలుగా పదోన్నతి

ఏపీ పోలీసులకు శుభవార్త: 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ఎస్ఐలుగా పదోన్నతి

వార్త 3 months ago

APSP ARSI Promotions: ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (APSP) విభాగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

హోం శాఖ నిన్న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఏపీఎస్పీ విభాగంలోని 300 హెడ్ కానిస్టేబుల్ (HC) పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ARSI) స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. 62ను అధికారికంగా విడుదల చేసింది.

Read Also:Redistribution of Constituencies : పులివెందుల కోటలో మార్పులు ఖాయమా

300 ఏఆర్ఎస్ఐ పోస్టుల కేటాయింపు వివరాలు

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని 8 ఏపీఎస్పీ బెటాలియన్ల పరిధిలో ఈ మార్పులు జరగనున్నాయి. అప్‌గ్రేడ్ చేసిన 300 ఏఆర్ఎస్ఐ పోస్టులకు సమానంగా, ప్రస్తుతం ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడకుండా పదోన్నతులు కల్పించే అవకాశం ఏర్పడింది.

 APSP Head Constable Promotions

APSP ARSI Promotions: బెటాలియన్ల వారీగా పోస్టుల విభజన

పదోన్నతులకు సంబంధించిన పోస్టుల కేటాయింపును ప్రభుత్వం కింది విధంగా విభజించింది: కర్నూలు (2వ బెటాలియన్), కాకినాడ (3వ), విజయనగరం (5వ), మంగళగిరి (6వ) బెటాలియన్లలో ఒక్కొక్కదానికి 42 చొప్పున పోస్టులను కేటాయించారు. అలాగే, 9, 11, 14, 16వ బెటాలియన్లకు తలా 33 పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు.

రాష్ట్ర డీజీపీ 2025 జనవరి 31న పంపిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు 2026 మార్చి 14న రాష్ట్ర కేబినెట్, మార్చి 26న ఆర్థిక శాఖ ఆమోదం తెలిపాయి. తాజాగా హోం శాఖ తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ అవకాశాలు మెరుగుపడనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వెబ్ సిరీస్ చూసి భర్తను చంపిన భార్య.. ఆపై ఏం చేసిందో తెలుసా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha